మరి కొద్ది గంటల్లో ముంచుకు రానున్న హమూన్ తుఫాన్, ఆ రాష్ట్రాలకు IMD అలెర్ట్
Hamoon Cyclone: హమూన్ తుఫాన్ మరో 12 గంటల్లో బలపడనుందని IMD హెచ్చరించింది.
Cyclone Hamoon:
హమూన్ తుఫాన్..
బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుఫాన్ (Hamoon Cyclone) మరి కొద్ది గంటల్లోనే బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేసింది. 12 గంటల్లో ఈ ఎఫెక్ట్ మొదలవుతుందని, ఆ తరవాత ఇది బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపు మళ్లే అవకాశముందని అంచనా వేసింది. అక్టోబర్ 25 సాయంత్రం నాటికి బంగ్లాదేశ్‌లో ఈ తుఫాన్ బలపడుతుందని తెలిపింది. IMD హెచ్చరికలతో ఇప్పటికే ఒడిశా అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్‌లకి ఆదేశాలిచ్చింది. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది. దిగువ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో మరి కొద్ది గంటల్లోనే వర్షాలు మొదలయ్యే అవకాశముందని IMD తెలిపింది. రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒడిశాతో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, మేఘాలయా, పశ్చిమబెంగాల్‌లోనూ ఇవే పరిస్థితులుంటాయని ప్రకటించింది. అటు అరేబియా సముద్రంలో తేజ్ తుఫాన్ (Cyclone Tej) కూడా క్రమంగా బలపడుతోంది. యెమెన్-ఒమన్ తీరాన్ని దాటి అక్టోబర్ 24 నాటికి బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
#CycloneHamoon is developing in the Bay of Bengal off the coast of Odisha, India. Hamoon is forecast to track toward southern Bangladesh this week. #HamoonCyclone
— Zoom Earth (@zoom_earth) October 23, 2023
Latest info here: https://t.co/zP4fYXi5Lo pic.twitter.com/aiyE11K7Jp
ఒకేసారి రెండు తుఫాన్ల దాడి..
అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో ఒకేసారి రెండు తుపాన్లు (Two Storms) పుట్టే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018 లో ఇలాగే రెండు తుపాన్లు వచ్చాయని, ఆ తరవాత ఇప్పుడు అది రిపీట్ అవుతుందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో తేజ్ సైక్లోన్ (Tej Cyclone),బంగాళాఖాతంలో హమూన్ తుపాను (Hamoon Cyclone) తొలి దశలో ఉన్నాయని తెలిపారు. నైరుతి అరేబియా సముద్రంలో తుపాను తీవ్రతరమవుతుందని అక్టోబర్ 22 నాటికి ఇది మరింత ఉద్ధృతంగా మారుతుందని వెల్లడించారు. అక్కడి నుంచి ఒమన్కి, యెమెన్కీ ఈ తుపాను విస్తరించే అవకాశాలున్నాయి. India Meteorological Department ఇప్పటికే ఈ విషయం వెల్లడించింది. ఇదే సమయంలో అటు బంగాళాఖాతంలోనూ హమూన్ తుపాన్ బలపడి క్రమంగా ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లోకి విస్తరించనుంది. అమరావతిలోని IMD కూడా హెచ్చరించింది. బంగాళాఖాతానికి నైరుతి దిశలో ఉన్న ప్రాంతాల్లో ప్రభావం కనిపించే అవకాశముందని అప్రమత్తం చేసింది. అక్టోబర్ 23 నాటికి ఇది బలపడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. దీనికే హమూన్ అనే పేరు పెట్టనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 24 నాటికి తీవ్రరూపం దాల్చుతుందని ప్రైవేట్ వెదర్కాస్ట్ సర్వీస్ Skymet స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
Also Read: బీజేపీలో ఉన్న వాళ్లంతా గూండాలే, వాళ్లను ఓడించి దేశ భక్తిని చాటుకుందాం - కేజ్రీవాల్