Covid Update: దేశంలో కరోనా భయం- వరుసగా మూడో రోజూ 8 వేలకు పైగా కేసులు
Covid Update: దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు..

Covid Update: దేశంలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు 8 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. తాజాగా 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 8,084 COVID19 cases and 10 deaths. Active cases rise to 47,995. Daily positivity 3.24% pic.twitter.com/hW2FQsIf17
— ANI (@ANI) June 13, 2022
రికవరీ రేటు 98.68 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.10 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,32,22,861
- మొత్తం మరణాలు: 5,24,771
- యాక్టివ్ కేసులు: 47,995
- మొత్తం రికవరీలు: 4,26,57,335
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 11,77,146 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,19,81,150కు చేరింది. మరో 2,49,418 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటకల్లోనే ఎక్కువ కేసులు ఉండటంతో గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫెక్లన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ లేఖ రాశారు.
వైరస్‌ను ముందుగా గుర్తించి వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్‌లదే కీలక పాత్ర అని ఆయన అన్నారు. అందువల్ల విస్తృత స్థాయిలో టెస్టులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్, కొవిడ్ నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
Also Read: Congress Protest: ఈడీ ముందుకు రాహుల్ గాంధీ- 'తగ్గేదేలే' అంటూ కాంగ్రెస్ సత్యాగ్రహ ర్యాలీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

