By: ABP Desam | Updated at : 14 Mar 2022 07:59 PM (IST)
Edited By: Murali Krishna
12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి టీకాలు
దేశంలో టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు.
Koo Appबच्चे सुरक्षित तो देश सुरक्षित! मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है। साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे। मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।- Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 14 Mar 2022
వీరందరికీ హైదరాబాద్‌కు చెందిన 'బయోలాజికల్ -ఈ' సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ను అందించనున్నట్లు సమాచారం. అలానే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 సంవత్సరాల వయసున్నవారికి టీకా పంపీణీ ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గత ఏడాది మే 1 నుంచి కరోనా టీకాలు అందిస్తున్నారు. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ఆ తర్వాత అందరికీ టీకా పంపిణీని దశలవారీగా మొదలు పెట్టారు.
కార్బెవాక్స్
బయోలాజికల్-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల తుది అనుమతులు ఇచ్చింది. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల పిల్లలకు ఇవ్వనుంది.
12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్‌కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బెవాక్స్ రికార్డులకెక్కింది. బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read: LIC IPO Postponed: LIC ఐపీఓ వాయిదా- కేంద్రం స్పీడుకు బ్రేకులు వేసిన పుతిన్!
Also Read: EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Drone Shot Down: అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!