అన్వేషించండి

EPFO Interest: ఈపీఎఫ్‌తో ఇరుక్కున్న కేంద్రం, ఎన్నికలు అవ్వగానే మొదలెట్టారని విమర్శలు

ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు తగ్గింపుతో కేంద్రం ఇరుకునపడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయినపోయిన తర్వాత కేంద్రం బాదుడు మొదలెట్టిందని విపక్షాలు గొంతులు సవరించుకుంటున్నాయి.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది.  గడచిన నలభై ఏళ్లలో లేని విధంగా ఎంప్లాయిస్ పీఎఫ్ మీద వడ్డీని అమాంతం తగ్గించటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే మధ్యతరగతి వేతన జీవుల నడ్డి విరిచేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. 

ఏంటీ వివాదం, ఎందుకు విపక్షాలు ఆగ్రహం?

అసలు ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఓ సారి చూద్దాం.ఈ నెల 12 న గౌహతిలో ఈపీఎఫ్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు....సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ ఈ ట్రస్టీ బోర్డ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సమావేశమైన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు పీఎఫ్ మీద వస్తున్న వడ్డీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అదీ గడచిన నలభై ఏళ్లలో చూడని విధంగా 8.1శాతానికి తగ్గిస్తూ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ  తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపించారు. 

ఎప్పుడెప్పుడు తగ్గింది

ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఈపీఎఫ్ సంస్థ షాక్ ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆందోళన చేయటం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరం లో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేశారు.

ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేసి.. కొత్త వడ్డీ రేటు అమలులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అభిప్రాయపడుతున్నారు.

అసలేంటీ ఈపీఎఫ్...దాని మీద వడ్డీ

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్ మెంట్ వరకు ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం రూపొందిందే ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్. షార్ట్ కట్ లో ఈపీఎఫ్ అంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952 తో ఈపీఎఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను నిర్వహించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరుతో ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దానికి ఓ బోర్డు,..ట్రస్ట్ సభ్యులు కూడా ఉంటారు. 

ఉద్యోగులు తాము ప్రతినెలా పొందే జీతంలో కొంత భాగం అంటే బేసిక్ ఆదాయంలో 12 శాతం ఈ పథకానికి చందాగా జమచేయాల్సి ఉంటుంది. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ జమ చేస్తుంది. దీనికి వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. రిటైర్ అయ్యేనాటికి ఉద్యోగి, యజమాని జమచేసిన మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి చేతికి అందుతుంది. ఈపీఎఫ్ లో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ నిధిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి. అంతేకాకుండా నిర్దేశిత వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది.

సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వడ్డీ 8.1 శాతం ఇదే. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గుతుంది. 2020 - 21 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటు 8.50 శాతంగా కట్టించారు. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5 శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించారు. 

ఇప్పుడు 40 ఏళ్లలో లేని విధంగా 8.1 శాతానికి తగ్గించేయటమే అసలు వివాదానికి కారణం. 450 కోట్ల రూపాయల సర్ ప్లస్‌లో ఉన్న బోర్డు...ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ తీర్మానాన్ని ఒప్పుకోకూడదంటూ ప్రతిపక్షపార్టీల నేతలు, ఉద్యోగ కార్మి సంఘాలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు రాస్తున్నారు. యూపీ ఎన్నికలు పూర్తికాగానే తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget