Childhood Allergies: అలెర్జీలు ఎలా వస్తాయో తెలుసా, రీసెర్చ్‌లో ఆసక్తికర విషయాలు
Childhood Allergies: పిల్లలకు వచ్చే ప్రధాన అలెర్జీలు తామర, ఉబ్బసం, ఆహార అలెర్జీ, గవత జ్వరం ఎక్కడ నుంచి సోకుతాయో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే.
Childhood Allergies: పిల్లలకు వచ్చే ప్రధాన అలెర్జీలు తామర, ఉబ్బసం, ఆహార అలెర్జీ, గవత జ్వరం ఎక్కడ నుంచి సోకుతాయో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. పిల్లల పేగులలో నివసించే బ్యాక్టీరియానే ఇందుకు ప్రధాన కారణమని ఓ అధ్యయనం తేల్చింది. మనం తినే ఆహారం, మనం ఎలా పుట్టాం, ఎక్కడ నివసిస్తున్నాం, యాంటీబయాటిక్స్ వంటి అనేక అంశాలు శిశువు పేగుల్లో మైక్రోబయోటాను నిర్ధారిస్తాయట. ఉదాహరణకు యాంటీబయాటిక్స్ సున్నితమైన బాక్టీరియాను తుడిచిపెట్టవచ్చ. అయితే తల్లిపాలు తాగే సమయంలో బయట ఉండే బ్యాక్టీరియా శిశువు ప్రేగులలోకి తిరిగి చేరుతుంది. దానికి కావాల్సిన ఆహారాన్ని పాల నుంచి తీసుకుంటుంది.
చాలా మంది పిల్లల కుటుంబాలు అలెర్జీల కారణంగా అనేక సమయాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుూ ఉంటాయని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ స్టువర్ట్ టర్వే అన్నారు. బీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు టర్వే మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది పిల్లలు అలెర్జీలతో బాధపడుతున్నారని, అందుకు గల కారణాలు, అలర్జీలను ఎలా నివారించవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన మేరకు.. బ్యాక్టీరియా పిల్లల పేగుల్లో మైక్రోబయోటా సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తుంది, అలెర్జీలకు ఎలా కారణమవుతోందో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు మంది పిల్లలపై బాక్టీరియా ప్రభావం చూపుతోందో పరిశీలించింది.
అధ్యయనం కోసం, పరిశోధకులు పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు వయసున్న 1,115 మంది పిల్లల క్లినికల్ అసెస్‌మెంట్‌లను పరిశీలించారు. వీరిలో దాదాపు సగం మంది పిల్లల్లో (523) అలెర్జీలకు సంబంధించిన ఆధారాలు లేవు. అయితే సగానికి పైగా (592) మంది పిల్లలు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అలెర్జీలతో బాధపడుతున్నారు. మూడు నెలలు నుంచి ఒక సంవత్సరం వయస్సు పిల్లల నుంచి సేకరించిన మలం నమూనాలల్లో సూక్ష్మజీవులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్లలోపు వారి మలం నమూనాల్లో నాలుగు అలర్జీలను కలిగించే బ్యాక్టీరియాలను గుర్తించినట్లు వెల్లడించారు.
సాధారణంగా మన ప్రేగులలో నివసించే మిలియన్ల బ్యాక్టీరియాను మన శరీరాలు తట్టుకోగలవు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచి పనులు చేస్తాయి. మన శరీరంలోని రోగనిరోధక కణాలు వాటిని తట్టుకునేలా చేస్తాయని యూబీసీ డాక్టరల్ అభ్యర్థి కోర్ట్నీ హోస్కిన్సన్ అన్నారు. పిలల్లో అర్జీలు ఏర్పడానికి ఒక సాధారణ అంశాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు. పిల్లల్లో అలర్జీలు రాకుండా తీసుకోవాల్సిన మార్గాలు కనుగొనేందుకు పరిశోధనలకు అది ఉపయోగపడొచ్చన్నారు.