News
News
X

4 రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ జాతీయ సదస్సు- అంతకంటే ముందే పార్టీ లీడర్ల ఇంటికీ ఈడీ

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దాడిని బీజేపీ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

FOLLOW US: 
Share:

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి భారీ సోదాలు నిర్వహిస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లకు చేరుకున్న ఈడీ బృందం విస్తృతంగా సోదాలు చేస్తోంది. ఇలా దాడులు జరుగుతున్న కాంగ్రెస్ నేతల్లో భిలాయ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఒకరు. ఈయనతోపాటు రాయ్ పూర్‌లోని లేబర్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు చెందిన సన్నీ అగర్వాల్ ఇంటిలో కూడా రైడ్స్ చేస్తున్నారు. అరడజను మంది సీనియర్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై మూకుమ్మడిగీ ఈ సోదాలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి సోమవారం ఉదయం రాయ్‌పూర్ దుర్గ్ జిల్లాలోని కాంగ్రెస్ నేతల ఇంటికి ఈడీకి చెందిన వివిధ బృందాలు చేరుకున్నాయి. ఉదయం నుంచి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ ఈడీ సోదాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది అక్టోబర్ నుంచి ఈడీ దాడులు జరుగుతున్నాయి. బొగ్గు రవాణాలో అవకతవకలు జరిగాయన్న కేసులో భాగంగా ఈడీ బృందం నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. గతంలో ఇదే కేసులో వ్యాపారవేత్తలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై ఈడీ దాడులు చేసింది. అయితే ఏయే నేతల ఇళ్లపై ఈడీ దాడులు చేస్తోందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

నిన్న ఎమ్మెల్యే బర్త్ డే, నేడు ఈడీ దాడులు
 
భిలాయ్ సెక్టార్ 5లోని ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఇంటిపై సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఈడీ బృందం ఉదయం దాడి చేసింది. ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ పుట్టిన రోజు ఆ వేడుకల హడావుడి ఇంకా ముగికయముందే ఫిబ్రవరి 20న ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మేయర్ నీరజ్ పాల్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఇంటికి చేరుకున్నారు.

సదస్సుకు ముందు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు

ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 24 నుంచి 26 వరకు కాంగ్రెస్ 85వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం వేళ కాంగ్రెస్ అధిష్ఠానానికి చెందిన ఒకరిద్దరు నేతలు ఛత్తీస్‌గఢ్‌ వెళ్తున్నారు. సమావేశానికి చెందిన ఏర్పాట్లు, నాయకుల సమీక్షల్లో పాల్గొంటున్న నేతల ఇళ్లపైనే ఇప్పుడు ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈడీ దాడులు చేసిన నేతల్లో భిలాయ్ నగర్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, రాంగోపాల్ అగర్వాల్, గిరీష్ దేవాంగన్, ఆర్పీ సింగ్, వినోద్ తివారీ, సన్నీ అగర్వాల్ ఉన్నారు.

బీజేపీ కుట్రలకు భయపడేది లేదు: సుశీల్ ఆనంద్

ఈడీ దాడుల వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి సుశీల్ ఆనంద్ శుక్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ సదస్సుపై బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు. ఈ సంప్రదాయానికి భంగం కలిగించేందుకు బీజేపీ అనుకున్నట్లుగానే ఈడీని ముందుకు తెచ్చింది. బీజేపీ పోటీ చేయలేనిప్పుడల్లా ఈడీ సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. కాంగ్రెస్ సమావేశాలతో తన విశ్వసనీయత పూర్తిగా పోతుందని బీజేపీ భయపడుతోంది. అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు.

తాము భయపడబోమని, తలవంచబోమని, తమ సదస్సును మరింత ఘనంగా నిర్వహిస్తామని సుశీల్‌ ఆనంద్‌ శుక్లా చెప్పారు. భారతీయ జనతా పార్టీ అహంకార స్వభావాన్ని గట్టిగా ఎదుర్కొంటామన్నారు. నరేంద్ర మోడీకి ఎప్పుడు భయంవేసినా ఈడీ, సీబీఐని ముందుకు తీసుకొస్తారని అన్నారు. 

ఇప్పటికే సీఎం సెక్రటేరియట్ అధికారులను అరెస్ట్ 

ఛత్తీస్‌గఢ్ లో గత ఏడాది నుంచి ఈడీ చర్యలు కొనసాగుతున్నాయి. 11 అక్టోబర్ 2022న రాష్ట్రంలో బొగ్గు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. దీంతోపాటు రాయగఢ్ కలెక్టర్ సాహు బంగ్లాలోనూ తనిఖీలు చేసింది. రాయ్ పూర్ లో సస్పెన్షన్ కు గురైన ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ పై కూడా దాడులు జరిగాయి. దీంతో ఈడీ సమీర్ విష్ణోయ్ తో పాటు ముగ్గురు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది. ఆ తర్వాత డిసెంబర్ లో ముఖ్యమంత్రి సెక్రటేరియట్ లో విధులు నిర్వహిస్తున్న సౌమ్య చౌరాసియా అనే అధికారిని కూడా ఈడీ అరెస్టు చేసింది. బొగ్గు రవాణాలో అవకతవకలు, అక్రమ లెవీ ఆరోపణలపై ఈడీ ఈ చర్య తీసుకుంది.

Published at : 20 Feb 2023 01:52 PM (IST) Tags: Enforcement Directorate Raid Chhattisgarh Congress Leaders Congress Session

సంబంధిత కథనాలు

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

The Elephant Whisperers Film: దేశం గర్వపడేలా చేశారు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బృందానికి ప్రధాని కితాబు

The Elephant Whisperers Film: దేశం గర్వపడేలా చేశారు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బృందానికి ప్రధాని కితాబు

ఇండోర్‌లోని రామనవమి ఆలయంలో అపశృతి- మెట్లబావిలో పడి 12 మంది మృతి

ఇండోర్‌లోని రామనవమి ఆలయంలో అపశృతి-  మెట్లబావిలో పడి 12 మంది మృతి

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు