అన్వేషించండి

Chandrayaan 3: ఈనెల 25న మరోసారి చంద్రయాన్-3 కక్ష్య పెంపు

Chandrayaan 3: చంద్రయాన్-3 కక్ష్యను మరోసారి పెంచనున్నారు శాస్త్రవేత్తలు. ఈ నెల 25వ తేదీన మరోసారి ఇంజిన్ ను మండించి తదుపరి దశలోకి చంద్రయాన్ ను మళ్లించనున్నారు.

Chandrayaan 3 Latest Updates: చంద్రయాన్ -3 కక్ష్యను మరోసారి పెంచనున్నారు. ఈ నెల 25వ తేదీన ఐదో సారి చంద్రయాన్ కక్ష్య దూరాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమయ్యారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan 3) మిషన్ లో భాగంగా కక్ష్య పొడగింపు చేపట్టనున్నారు. 25వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్ తో చంద్రయాన్ -3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడికి చేరుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టనుంది. ఆగస్టు 1వ తేదీ నాటికి చంద్రయాన్ -3 లూనార్ ఆర్బిట్ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఆగస్టు 23వ తేదీన చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ ను విడిచి పెడుతుంది. 

నాలుగు  లక్షల కిలోమీటర్ల ప్రయాణం

చంద్రయాన్ 3ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి  Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. బరువు 3,921 కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది.

ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి సౌత్ పోల్‌ కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపొల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్‌ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ విడిపోతుంది. లాంఛ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది.

తక్కువ ఖర్చుతో ప్రయోగం

చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. ఇస్రో మాత్రం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్ సైతం ఇస్రో వద్ద లేకపోయినా క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపట్టింది. భారత్ సత్తా ప్రపంచమంతా చాటేలా ప్రయోగం చేసింది.

వర్చువల్ టెలిస్కోప్‌కు చిక్కిన చంద్రయాన్ (Chandrayaan - 2)

ఇటలీలోని మన్సియానోకు చెందిన వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న చంద్రయాన్-3ను చిత్రీకరించింది. అందులో చంద్రయాన్-3 ఓ చుక్కలా వేగంగా ప్రయాణిస్తోంది. భూమికి 341 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-3 కదలికలను వర్చువల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇటలీకి చెందిన ఈ వర్చువల్ టెలిస్కోప్ ఖగోళానికి చెందిన పలు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇస్తూ ఉంటుంది. చంద్రయాన్-3 విషయంలోను ఈ టెలిస్కోప్ తన పనితనం, నైపుణ్యం ప్రదర్శించింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget