Chandrayaan 3 Launch: చంద్రయాన్ 3 మిషన్‌పై అదిరిపోయే శాండ్ ఆర్ట్, సక్సెస్ అవ్వాలంటూ విషెస్
Chandrayaan 3 Launch: చంద్రయాన్ 3 మిషన్‌పై సుదర్శన్ పట్నాయక్ అదిరిపోయే శాండ్ ఆర్ట్ గీసి విషెస్ చెప్పారు.
Chandrayaan 3 Launch:
పూరీ బీచ్‌లో
చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవ్వాలని ఇండియా మొత్తం చాలా గట్టిగానే కోరుకుంటోంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అవడం వల్ల ఈ సారి మాత్రం గురి తప్పకూడదన్న పట్టుదలతో ఉంది ఇస్రో. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇస్రోకి పూర్తి మద్దతు లభిస్తోంది. విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా అంతా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి (Sand Artist) సుదర్శన్ పట్నాయక్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఇస్రో ప్రయోగం సక్సెస్ అవ్వాలంటూ కొత్త ఆర్ట్ వేశాడు. చంద్రయాన్ 3 కి సంబధించిన డిజైన్ని 22 అడుగుల పొడవులో ఇసుకతోనే బొమ్మ గీశాడు. వాటిపై దాదాపు 500 స్టీల్ బౌల్స్, డిషెస్ అమర్చాడు. విజయీభవ అని సందేశం కూడా ఇచ్చాడు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఈ ఆర్ట్ వేశాడు సుదర్శన్ పట్నాయక్.
#WATCH | Renowned sand artist Sudarsan Pattnaik created a 22 ft long sand art of Chandrayaan 3 with the installation of 500 steel bowls with the message "Bijayee Bhava", at Puri beach in Odisha, yesterday.
— ANI (@ANI) July 13, 2023
The Indian Space Research Organisation's third lunar exploration mission,… pic.twitter.com/Gr4SNEZDEy
యూపీ పోలీసులు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు బెస్ట్ విషెస్ చెప్పారు. స్పెషల్ ట్వీట్ కూడా చేశారు.
'5..4..3..2..1..0.....𝘓𝘢𝘶𝘯𝘤𝘩'
— UP POLICE (@Uppolice) July 14, 2023
Precise timing & correct trajectory leaves no 'space' for mishaps . Wishing @isro stellar success at the launch of #Chandrayaan3#OrbitOfSafety#ISROTeam pic.twitter.com/1DecJbTECJ
యావత్ ప్రపంచానికి ఆసక్తి..
ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ప్రయోగానికి గురువారం కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. తొలిసారిగా చంద్రుడికి ఆవల వైపు ల్యాండర్, రోవర్లను పంపనున్నారు. అందుకే యావత్ ప్రపంచం ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మంచి ఉత్సాహం మీద ఉన్న ఇస్రో మాత్రం కచ్చితంగా ఈ ప్రయోగం విజయం సాధిస్తుందన్న నమ్మతం ఉంది. 2019 జులై15 చంద్రయాన్-2 ప్రయోగం చేసి ఇస్రో విపలమైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. చంద్రుని వద్ద ఉన్న మరిన్ని రహస్యాలను ఛేదించేందుకే ఈ ప్రయానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు ఉంటాయి. టోటల్‌గా దీని బరువు 3,920గా చెబుతున్నారు. ఈసారి కేవలం ఆరు పేలోడ్స్‌ను మాత్రమే పంపుతున్నారు. ఇందులో ఒక ఇస్రో పేలోడ్ ఉంది. చంద్రుడిపై ల్యాండర్ ను దింపే సత్తా భారత్ ఇస్రోకు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ అన్నారు. చంద్రయాన్ 3 పై మాట్లాడిన ఆయన చంద్రుడు లక్ష్యంగా భారత్ చేస్తున్న చంద్రయాన్ మిషన్ విజయవంతమైన ప్రయోగం అన్నారు. చంద్రుడి మీద ల్యాండర్ ను సేఫ్ ల్యాండ్ చేసి ఈ ఘనత సాధించిన నాలుగోదేశంగా భారత్ కీర్తి గడిస్తుందని నంబి నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: చంద్రయాన్ 3 మిషన్‌లో ఆ పావుగంటే కీలకం, ఆ గండం దాటితే సక్సెస్ అయినట్టే!