అన్వేషించండి

Independence Day 2023: నిఘా నీడలో ఢిల్లీ, పంద్రాగస్టు వేడుకలకు 10 వేల మందితో భద్రత

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 10,000 మందికి పైగా పోలీసులను మోహరించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 10,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తూనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

స్వాతంత్ర వేడుకలపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) సుమన్ నల్వా మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రతను ఢిల్లీ పోలీసులు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. నగరం అంతటా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీ వాహనాలను రాజధానిలోకి అనుమతించం. సరిహద్దుల వద్ద తనిఖీ చేయడానికి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. అవసరమైన చోట ట్రాఫిక్ ఆంక్షలు విధించాం. ప్రజలకు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్లను అందిస్తున్నాం’ అని చెప్పారు. 

స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఢిల్లీ అంతటా అంతటా ప్రధాన వేదిక ఎర్రకోట, కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లే మార్గంలో  మోహరించిన 10,000 మంది అధికారులతో భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నేరుస్తులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమల్లో ఉందని అధికారి తెలిపారు. 

DCP (నార్త్) సాగర్ సింగ్ కల్సి అధికార పరిధిలో ఎర్రకోట ఉంది. గత రెండు నెలలుగా, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, పేయింగ్ గెస్ట్ వసతి, లాడ్జీల వద్ద కఠినమైన ఐటెంటిఫికేషన్ డ్రైవ్ నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కోసం తనిఖీలు చేపట్టారు. నగరంలోని ప్రతి పికెట్ వద్ద ప్రతిరోజూ వందల వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. 

ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక, వ్యూహాత్మక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ)తో సహా యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసినట్లు మరో అధికారి తెలిపారు. అలాగే ప్రజలకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. 

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో రోడ్లు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ మార్గ్, లోథియన్ రోడ్, ఎస్పీ ముఖర్జీ మార్గ్, చాందినీ చౌక్ రోడ్, నిషాద్ రాజ్ మార్గ్, ఎస్ప్లానేడ్ రోడ్, దాని లింక్ రోడ్, రాజ్‌ఘాట్ నుంచి ఐఎస్‌బీటీ వరకు రింగ్ రోడ్, ఐఎస్‌డీటీ నుంచి ఐపీ ఫ్లైఓవర్ వరకు, ఔటర్ రింగ్ రోడ్డు ఇదే సమయంలో మూసివేస్తున్నట్లు చెప్పారు. 

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులను ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆగస్టు 15 ఉదయం 11 గంటల వరకు కశ్మీర్ గేట, రింగ్ రోడ్ మీదుగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పార్కింగ్ లేబుల్స్ లేని వాహనాలు సి-హెక్సాగాన్, ఇండియా గేట్, కోపర్నికస్ మార్గ్, మండి హౌస్, సికంద్రా రోడ్, డబ్ల్యూ పాయింట్, ఎ పాయింట్ తిలక్ మార్గ్, మథుర రోడ్, బీఎస్‌జెడ్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్, జెఎల్ నెహ్రూ నుంచి మార్గ్, నిజాముద్దీన్ ఖట్టా ISBT కష్మీరే గేట్ మధ్య రింగ్ రోడ్, నిజాముద్దీన్ ఖట్టా నుంచి ISBT కశ్మీర్ గేట్ వరకు సలీంఘర్ బైపాస్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో వెళ్లాలని సూచించారు. 

1800 మంది ప్రత్యేక ఆహ్వానితులు
స్వాతంత్ర వేడుకలకు దేశం నలుమూల నుంచి సామాన్యులు 1800 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందులో 400 మంది సర్పంచ్‌లు, 250 మంది వ్యవసాయ, రైతు అనుబంధ సంఘాలకు చెందిన వారు ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి కౌషల్ వికాష్ యోజన లబ్ధిదారులు 50 మంది చొప్పున ఆహ్వానించారు.

పార్లమెంటును నిర్మించిన కూలీలు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్‌ సరోవర్, హర్‌ ఘర్‌ జల్‌ యోజన ప్రాజెక్ట్‌ కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు, చేనేత కార్మికులు 50 మంది చొప్పున ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. వీరంతా ఎర్రకోట వద్ద జెండా వందనంలో పాల్గొంటారు.  ఈ ప్రత్యేక అతిథులలో కొందరు జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించి, ఢిల్లీలో రక్ష రాజ్య మంత్రి అజయ్ భట్‌ను కలవనున్నారు.

మార్చి 12, 2021న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని ప్రారంభించిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం ముగుస్తుంది. 

నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, సహా 12 ప్రదేశాలలో వివిధ పథకాలు & ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్, ITO మెట్రో గేట్, నౌబత్ ఖానా, షీష్ గంజ్ గురుద్వారా వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. 

అంతే కాకుండా రక్షణ మంత్రిత్వ శాఖ MyGov పోర్టల్‌లో ఆగస్టు 15-20 వరకు ఆన్‌లైన్ సెల్ఫీ పోటీని కూడా నిర్వహిస్తుంది. పైన పేర్కొన్న 12 సెల్ఫీ పాయింట్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుని వాటిని MyGov ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇందులో ప్రతి పాయింట్ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Embed widget