అన్వేషించండి

India's Population: జులై 1 నాటికి మన దేశ జనాభా ఎంత? లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం

India's Population: జులై 1, 2023 నాటికి భారతదేశ జనాభా అంచనా 139 కోట్లు అని మంగళవారం కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.

India's Population: భారత జనాభా చైనాను మించిపోయిందని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా గల దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలోకి వచ్చినట్లు కొన్ని రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం తెలిసిందే. జనాభా పరంగా భారత్ చైనాను మించి పోయిందని వార్తలు వచ్చాయి. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలు కాగా.. భారత్ జనాభా 142 కోట్ల 86 లక్షలకు పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం జనాభా అంచనాను ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. మూడేళ్ల క్రితం జరగాల్సి ఉన్నా...కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉంది. తాజాగా జనాభా విషయంపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 

139.23 కోట్లుగా భారత్ జనాభా: కేంద్రం

జాతీయ కమిషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన టెక్నికల్ గ్రూప్ నివేదిక ప్రకారం.. జులై 1, 2023 నాటికి జనాభా అంచనా 139.23 కోట్లు అని లోక్‌సభలో కేంద్ర సర్కారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కరోనా కారణంగా 2021 జనాభా లెక్కలు నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. అలాగే 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 20 కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఇటీవల, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో మాట్లాడుతూ 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 19.7 కోట్లు ఉంటుందని అంచనా అని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. 2023 అంచనా ప్రకారం ముస్లింల జనాభా 19.7 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. 

పడిపోతున్న చైనా జనాభా

పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా(China Population) ...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్‌ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే.. చైనాను దాటేసి మరీ భారత్‌ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది. చైనా విషయానికొస్తే...జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి కనీసం 11 కోట్ల మేర జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. "చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదు" అని స్పష్టం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget