By: ABP Desam | Updated at : 07 Aug 2021 01:14 PM (IST)
కార్లకు ఆరు ఎయిర్ బ్యాగ్‌లు(ప్రతీకాత్మక చిత్రం)
రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్ల తయారీ సంస్థలు కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని కేంద్ర రవాణాశాఖ, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. కేంద్ర రవాణా శాఖ లెక్కల ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాదాలతో ప్రతి రోజు 400 మంది మరణిస్తున్నారు. ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, ఈ ప్రమాద బాధితుల్లో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సూచనలు చేశారు.
ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సీఈఓల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కనీసం 6 ఎయిర్ బ్యాగ్లను కార్లలో ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు తెలిపారు. ఒక ఎయిర్ బ్యాగ్ ఉన్న పాత కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడుపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏడాదిలోపు అన్నీ మోడళ్ల కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాటు. ఇకపై అన్ని రకాల కారులలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని కార్ల తయారీ సంస్థలకు మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా కారు-లారీ ఢీ.. నలుగురు మృతి
ఏడాది లోపు 100 శాతం ఇథనాల్, పెట్రోల్‌తో నడిచే వాహనాలను మార్కెట్ లోకి తీసుకురావాలని నితిన్ గడ్కరీ కోరారు. ప్రయాణికుల భద్రతా ప్రయోజనాల మేరకు అన్ని రకాల కార్లలో ఆరు బ్యాగులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కార్లు, టూ వీలర్స్ తయారీ సంస్థలు పర్యావరణ నిబంధనల అమలు గడువును పొడిగించాలని మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించారు. బీఎస్-6 ఫేస్ 2, కేఫ్ ఫేస్-2తోపాటు ద్విచక్ర వాహనాల కోసం తీసుకువచ్చిన ఓబీడీ రెగ్యులేషన్స్ అమలు గడువును పొడిగించాలన్నారు. వెహికల్ ఇంజినీరింగ్‌లో ఆటోమొబైల్ సంస్థ పనితీరును ప్రశంసించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా ఎయిర్ బ్యాగ్స్ పెంపుపై నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
Also Read: BJP YCP Fight: రాబోయే రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ కలకలం...
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు
Bullet Train Project: 2026 నాటికి భారత్‌లో బులెట్ ట్రైన్, మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు - ABPతో రైల్వే మంత్రి
Ram Mandir Construction: అయోధ్య రాముడి కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు, భక్తుల ఘనస్వాగతం
Dattatreya Hosabale: భారతీయులందరూ పుట్టుకతో హిందువులే, బీఫ్ తినే వాళ్లనూ మతంలోకి ఆహ్వానిద్దాం - RSS లీడర్
Bihar Student Fainted: ఎగ్జామ్ హాల్లో కళ్లు తేలేసిన కుర్రాడు, పేపర్‌ను చూసి కాదు అమ్మాయిల్ని చూసి
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్‌డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్మెంట్ రేపే!