News
News
X

ప్రపంచ సమస్యలకు భారత్‌ పరిష్కారం- ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం  

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఒకప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఇతరులపై ఆధారపడిన భారత్ నేడు ప్రపంచ సమస్యల పరిష్కారానికి మాధ్యమంగా మారిందన్నారు.

FOLLOW US: 
Share:

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసగించారు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా సెంట్రల్‌ హాల్‌లో తొలి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన పనులు, ప్రపంచం దృష్టిలో పెరిగిన దేశ ప్రతిష్టను వివరించారు.  

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఒకప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఇతరులపై ఆధారపడిన భారత్ నేడు ప్రపంచ సమస్యల పరిష్కారానికి మాధ్యమంగా మారిందన్నారు. దేశంలోని ఎక్కువమంది ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సౌకర్యాలు ఇన్నాళ్లకు వారికి అందుబాటులోకి వచ్చాయన్నారు. 

తొమ్మిదేళ్లలో ఎన్నో సానుకూల మార్పులు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషితో చాలా విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. అభివృద్ధి భారత నిర్మాణానికి ఈ మంత్రమే ప్రేరణగా మారింది. మరికొద్ది నెలల్లో ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో సానుకూల మార్పులు చూశారు. ఆత్మవిశ్వాసం అగ్రస్థానంలో ఉంది. భారతదేశం వైపు ప్రపంచం చూసే విధానం మారింది. ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్ ఒక మాధ్యమంగా మారుతోంది.

ప్రతి సమస్యకు దీటైన సమాధానం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సర్జికల్ స్ట్రైక్స్ నుంచి నేటి వరకు ఉగ్రవాదంపై ముప్పేట దాడి చేసినట్టు పేర్కొన్నారు. నియంత్రణ రేఖ నుంచి ఎల్ఏసీ వరకు, ఆర్టికల్ 370 రద్దు నుంచి ట్రిపుల్ తలాక్ వరకు ప్రతి సమస్యకు తమ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు తీసుకున్నామని ద్రౌపది ముర్ము అన్నారు.

2047 నాటికి ఉజ్వల భారత్‌ను నిర్మించాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమృత్‌కాల్‌ అంటే వచ్చే 25 సంవత్సరాల కాలం అభివృద్ధి చెందిన భారత్‌ చూడటానికి చాలా కీలకమైన కాలంగా అభివర్ణించారు. ఒక శకాన్ని నిర్మించడానికి ఇది తమకు లభించిన ఓ మంచి అవకాశం. 2047 నాటికి మనం ఒక దేశాన్ని నిర్మించాలి, ఇది గతం వైభవంతో ముడిపడి ఉన్న ఆధునిక, ఉజ్వల్ భారత్‌ నిర్మించాలన్నారు. స్వావలంబనతో కూడిన భారత్ ను నిర్మించాలి. పేదరికం లేని భారతదేశం ఉండాలి. మధ్యతరగతి కూడా వైభవోపేతంగా ఉంటుంది అన్నారు. 

పేదలకు రూ.27 లక్షల కోట్లు: ముర్ము

పూర్తి పారదర్శకతతో కోట్లాది మందికి రూ.27 లక్షల కోట్లకు పైగా అందించామని ముర్ము తెలిపారు. ఇలాంటి పథకాలు, వ్యవస్థలతో కొవిడ్ సమయంలో దారిద్య్రరేఖకు దిగువకు వెళ్లకుండా లక్షలాది మందిని భారత్ కాపాడగలిగిందని ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించారు.

ఆయుష్మాన్ భారత్ పథకం పేదలు నిరుపేదలుగా మారకుండా కాపాడింది: రాష్ట్రపతి ముర్ము

ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలను నిరుపేదలుగా మారకుండా కాపాడిందని, 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా కాపాడిందని ముర్ము అన్నారు. 7 దశాబ్దాల్లో దేశంలో మూడున్నర కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీటిని అనుసంధానం చేశారు.

ట్యాక్స్ రీఫండ్స్ ఆటోమేటిక్ గా వస్తున్నాయి: ద్రౌపది ముర్ము

గతంలో పన్ను రీఫండ్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఐటీఆర్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే రిఫండ్ వస్తుంది. నేడు జిఎస్టి పారదర్శకతతో పాటు పన్ను చెల్లింపుదారుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. 

తొలిసారిగా పురుషుల కంటే మహిళలే ఎక్కువ: రాష్ట్రపతి
మహిళల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ... ఈ రోజు 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారం విజయాన్ని చూస్తున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య పెరిగిందని, మహిళల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉందన్నారు. ఏ రంగంలోనూ మహిళలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చూసుకున్నారన్నారు.

11 కోట్ల మంది సన్నకారు రైతులకు ప్రాధాన్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలోని 11 కోట్ల మంది సన్నకారు రైతులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదన్నారు. దశాబ్దాలుగా ఈ సన్నకారు రైతులు ప్రభుత్వ ప్రాధాన్యత కోల్పోయారన్నారు. ఇప్పుడు వారిని శక్తివంతం చేయడానికి, సుసంపన్నం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

'మేడ్ ఇన్ ఇండియా' ప్రచారం విజయవంతమైంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలో ఒకవైపు అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు ఆధునిక పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఓ వైపు కేదార్ నాథ్ ధామ్, కాశీ విశ్వనాథ్ ధామ్, మహాకాల్ మహలోక్ ను నిర్మించామని, మరోవైపు తమ ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తోందన్నారు.

ప్రభుత్వ నూతన చొరవ ఫలితంగా మన రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపంలో తొలి స్వదేశీ విమాన వాహక నౌకను కూడా మన సైన్యంలో ప్రవేశపెట్టడం గర్వకారణమని ద్రౌపది ముర్ము అన్నారు. మేడిన్ ఇండియా ప్రచారం, స్వావలంబన భారత్ ప్రచారం విజయవంతం కావడంతో దేశం ప్రయోజనాలు పొందుతోందన్నారు. 

Published at : 31 Jan 2023 11:33 AM (IST) Tags: Nirmala Sitharaman budget session President Droupadi Murmu Union Budget 2023 Budget Session 2023 Economy Survey Economy Survey 2023 Budget 2023 update Budget 2023 News President Murmu address Parliament address President Murmu

సంబంధిత కథనాలు

Amritpal Singh Video: పోలీసులు మా ఇంటికి వ‌చ్చుంటే - అమృత్‌పాల్ సింగ్‌ వీడియో వైరల్

Amritpal Singh Video: పోలీసులు మా ఇంటికి వ‌చ్చుంటే - అమృత్‌పాల్ సింగ్‌ వీడియో వైరల్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP-Cvoter Karnataka Opinion Poll Live Updates: కర్ణాటకలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, తేల్చి చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP-Cvoter Karnataka Opinion Poll Live Updates: కర్ణాటకలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, తేల్చి చెప్పిన  ABP CVoter ఒపీనియన్ పోల్‌

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

Mohammed Faizal: అనర్హత వేటు నుంచి బయట పడ్డ ఎన్‌సీపీ ఎంపీ, రాహుల్ లీగల్ టీమ్‌కి దారి దొరికినట్టేనా?

Mohammed Faizal: అనర్హత వేటు నుంచి బయట పడ్డ ఎన్‌సీపీ ఎంపీ, రాహుల్ లీగల్ టీమ్‌కి దారి దొరికినట్టేనా?

టాప్ స్టోరీస్

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి