Birbhum Violence: సభలో కన్నీరు పెట్టిన మహిళా ఎంపీ- జీవించే హక్కు లేదా అంటూ ఆవేదన
బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై మాట్లాడుతూ పార్లమెంటులో కన్నీరు పెట్టారు భాజపా ఎంపీ రూపా గంగూలీ.
బంగాల్ బీర్భూమ్‌లో జరిగిన హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనను భాజపా ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. జీరో అవర్‌లో జరిగిన చర్చలో ఈ ఘటనపై భాజపా ఎంపీ రూపా గంగూలీ మాట్లాడారు. అయితే మాట్లాడే సమయంలో ఆమ ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | BJP MP Roopa Ganguly broke down in Rajya Sabha over Birbhum incident, demanded President's rule in West Bengal saying, "Mass killings are happening there, people are fleeing the state... it is no more liveable..." pic.twitter.com/EKQLed8But
— ANI (@ANI) March 25, 2022
మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె ఉద్వేగపూరితంగా మాట్లాడారు.
దారుణం
బీర్భూమ్ జిల్లా రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.
ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు.
Also Read: UP CM Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం- కిక్కిరిసిన స్టేడియం
Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం