News click: న్యూస్ క్లిక్ విషయంలో కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
News click: న్యూస్ క్లిక్ విషయంలో కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
న్యూస్ క్లిక్ పై వెలువడిన మీడియా కథనంపై బిజెపి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. న్యూస్ క్లిక్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రులు న్యూస్ క్లిక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య న్యూస్ క్లిక్ విషయంలో వాడి వేడిగా ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో దేశంలో వ్యతిరేకతను నెలకొల్పలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ విషయంలో అధికార బిజెపి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రమైన ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై బిజెపి ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్, చైనా న్యూస్ క్లిక్ ఒకే జాతికి చెందినవేనని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నకిలీ ప్రేమ దుకాణాల్లో చైనా వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చైనా పట్ల ఆయనకున్న ప్రేమ కనిపిస్తోందని తెలియజేశారు. ఆ పార్టీ వ్యక్తులు భారత వ్యతిరేక ఎజెండాను నడుపుతున్నాయని మండిపడ్డారు.
ఆ న్యూస్ ఫోటోలకు చైనా నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలతో వెలువడిన కథనాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు స్పందించారు. " నెవిల్లే రాయి సింగం ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని అని న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు తెలియజేశాయి. చైనా ఎజెండాను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ వెబ్సైట్ నడుపుతున్నారు" అని కేంద్రమంత్రి ఠాకూర్ ఆరోపించారు.
బిజెపి ప్రభుత్వం సోమవారం ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించింది. బిజెపి ఎంపీ నిషికాంత్ దుబే మాట్లాడుతూ... "న్యూస్ క్లిక్ కు చైనా నుంచి నిధులు అందుతున్నాయి. ఆ నిధులతో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ పై ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించాలి" అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన క్లిప్ ను సామాజిక మాధ్యమాల్లో దుబే షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మాటలను వెంటనే రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా కు రాసిన లేఖలో డిమాండ్ చేసింది. ఆన్ ది రికార్డు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎలా అనుమతి లభించిందో విచారణ జరపాలని కోరింది.