Delhi Buldozer politics : ఢిల్లీలో 80 శాతం అక్రమ నిర్మాణాలే, కూల్చేస్తారా? - బీజేపీని ప్రశ్నించిన కేజ్రీవాల్ !
ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతను కేజ్రీవాల్ తప్పు పట్టారు. ఢిల్లీలో 80శాతం ఆక్రమణలు ఉన్నాయని అన్నింటినీ కూల్చివేస్తారా అని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు బుల్డోజర్ రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాల పేరుతో పెద్ద ఎత్తున బుల్డోజర్లతో కూల్చివేతలకు దిగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేలందరితో సమావేశమైన ఆయన భారతీయ జనతా పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.
ఢిల్లీలోని 63 లక్షల ప్రజల నివాసాలు, దుకాణాలను ఈ బుల్డోజర్లు కూల్చివేస్తే. . స్వతంత్ర దేశంలో ఇదే అతి పెద్ద విధ్వంసం కానుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జ్ఞానవాపి మసీదులో శివలింగం- కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
ఈ అంశంపై ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశంలో బిజెపి నేతృత్వంలోని పలు మునిసిపల్ కార్పోరేషన్‌లలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటింారు. జైలుకి వెళ్లేందుకు కూడా వెనకాడమని అన్నారు. ఢిల్లీలో నిర్మాణాలు ప్రణాళికా బద్ధంగా జరగలేదని, 80 శాతానికి పైగా ఆక్రమణలు ఉన్నాయని .. అంటే 80 శాతం నిర్మాణాలను ధ్వంసం చేస్తారా అని బీజేపీని ప్రశ్నించారు. సుమారు 50 లక్షల మంది ప్రజలు అనధికార కాలనీల్లో నివసిస్తున్నారని, పది లక్షల మంది మురికి వాడల్లో నివసిస్తున్నారని, లక్షలాది మంది మ్యాప్‌లకు అనుగుణంగా లేని కట్టడాల్లో ఉంటున్నారని అన్నారు.
గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భారీగా సిబ్బంది కొరత- సర్వేలో షాకింగ్ విషయాలు!
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల సమస్యను ఆమ్ ఆద్మీ పార్టీ పరిష్కరిస్తుందని, అనధికార కాలనీల్లో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులు అందిస్తామని కేజ్రీవాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. 63 లక్షల ప్రజల నివాసాలను, దుకాణాలను కూల్చివేయడాన్ని సహించబోమని అన్నారు. గత 15 ఏళ్లలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిజెపి అధికారంలో ఉంది. మే 18తో కార్పొరేషన్ పదవీకాలం ముగియనుండగా రాజ్యాంగ పరంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీకి లేదని కేజ్రీవాల్ అంటున్నారు. ఎంసిడి ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వచ్చి తీరుతుందని అంటున్నారు.
మహిళా లాయర్‌ను తంతూ, జుట్టు లాగుతూ రోడ్డుపై దాడి- షాకింగ్ వీడియో
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రాజకీయాల కోసమే ఇలా బుల్డోజర్లను తెరపైకి తెచ్చారని ఆప్ నేతలు అంటున్నారు. అయితే ఆక్రమణలు... అక్రమ నిర్మాణాల వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని.. నగరం ప్రణాళిక లేకుండా తయారైందని అందుకే కూల్చివేస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీ కూల్చివేతలు మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.