Healthcare In Rural Areas: గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భారీగా సిబ్బంది కొరత- సర్వేలో షాకింగ్ విషయాలు!
Healthcare In Rural Areas: కరోనా దెబ్బకు దేశ ఆరోగ్య వ్యవస్థ డొల్లతనం బయటపడింది. అయితే ఇంకా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలు చాలానే ఉన్నాయి.
Healthcare In Rural Areas:
రూరల్ హెల్త్ మేన్‌పవర్ రిక్వైర్‌మెంట్– 2005 నుంచి 2021
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. దేశంలోని ప్రతి గ్రామీణ ఆరోగ్య కేంద్రంలోనూ సిబ్బంది కొరత ఉంది. 2021 రూరల్ హెల్త్ గణాంకాల ప్రకారం ఈ కొరత భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
లెక్కలు
2021 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 68 శాతానికి చేరింది. 2005లో ఇది 53 శాతంగా ఉంది. సర్జన్లు, ఫిజీషియన్లు, పెడియాట్రిషియన్లు (శిశువైద్య నిపుణుడు), ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టులు ఇలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వీరి కొరత భారీగా కనిపిస్తోంది. 2021 గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 9 వేలకు పైగా స్పెషలిస్ట్ వైద్యుల అవసరం ఉంది.
ప్రైమరీ హెల్త్ సెంటర్లలో (పీహెచ్‌సీలు) 21 శాతం వైద్యుల కొరత ఉంది. 2005లో ఇది 17 శాతంగా ఉండేది.
Source: Rural Health Statistics 2020-21
సీహెచ్‌సీలలో కొరత
సంవత్సరం |
మంజూరైన వైద్యులు |
ఎంతమంది ఉన్నారు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
7,582 |
3,550 |
4,032 |
53% |
2021 |
13,637 |
4,405 |
9,232 |
68% |
Source: Rural Health Statistics 2020-21
పీహెచ్‌సీలలో కొరత
సంవత్సరం |
మంజూరైన సంఖ్య |
ఎంతమంది ఉన్నారు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
24,476 |
20,308 |
4,168 |
17% |
2021 |
40,143 |
31,716 |
8,427 |
21% |
Source: Rural Health Statistics 2020-21
ఆరోగ్య కార్యకర్తల కొరత
గత 16 ఏళ్లలో ఆరోగ్య కేంద్రాల్లో మహిళా కార్యకర్తల కొరత భారీగా పెరిగింది. 2005లో 5 శాతం ఉన్న ఈ కొరత 2021కి 20 శాతానికి పెరిగింది.
సంవత్సరం |
మంజూరైనవి |
ఉన్నవాళ్లు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
1,39,798 |
1,33,194 |
6,604 |
5% |
2021 |
2,68,913 |
2,14,820 |
54,093 |
20% |
Source: Rural Health Statistics 2020-21
సీహెచ్‌సీలలో రేడియోగ్రాఫర్ల కొరత
సంవత్సరం |
మంజూరైనవి |
ఉన్నవాళ్లు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
1,669 |
1,337 |
332 |
20% |
2021 |
3,948 |
2,418 |
1,530 |
39% |
Source: Rural Health Statistics 2020-21
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో ఫార్మాసిస్ట్‌ల కొరత
సంవత్సరం |
మంజూరైనవి |
ఉన్నవాళ్లు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
21,072 |
17,708 |
3,364 |
16% |
2021 |
37,651 |
28,537 |
9,114 |
24% |
Source: Rural Health Statistics 2020-21
లేబొరేటరీ టెక్నీషియన్ల కొరత
సంవత్సరం |
మంజూరైనవి |
ఉన్నవాళ్లు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
14,571 |
12,284 |
2,287 |
16% |
2021 |
32,739 |
22,723 |
10,016 |
31% |
Source: Rural Health Statistics 2020-21
నర్సుల కొరత
సంవత్సరం |
మంజూరైనవి |
ఉన్నవాళ్లు |
ఖాళీలు |
ఖాళీల శాతం |
2005 |
34,061 |
28,930 |
5,131 |
15% |
2021 |
1,06,725 |
79,044 |
27,681 |
26% |
Source: Rural Health Statistics 2020-21