(Source: ECI/ABP News/ABP Majha)
Nitish Kumar Meets Lalu Prasad Yadav: విషమంగా లాలూ యాదవ్ ఆరోగ్యం- ప్రధాని మోదీ ఆరా, నితీశ్ పరామర్శ!
Nitish Kumar Meets Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఆసుపత్రికి వెళ్లి లాలూను పరామర్శించారు.
Nitish Kumar Meets Lalu Prasad Yadav: బిహార్ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో లాలూను.. పట్నా నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు బుధవారం తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్నాలోని పారాస్ ఆసుపత్రిలో లాలూకు చికిత్స అందిస్తున్నారు.
సీఎం పరామర్శ
లాలూ ఆరోగ్యంపై వార్తలు రావడంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆయనను పరామర్శించారు. స్వయంగా పారాస్ ఆసుపత్రికి వచ్చి లాలూను కలిశారు. కుమారులు, వైద్యులను అడిగి లాలూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రధాని ఆరా
ఇక లాలూ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. లాలూ తర్వగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.
Bihar | His condition is stable. Everyone knows about his kidney & heart issues for which treatment was going on in Delhi. Those doctors have his medical history& that's the reason we are taking him there: RJD leader & Lalu Prasad Yadav's son Tejashwi Yadav outside the hospital pic.twitter.com/R9Hiys9PRO
— ANI (@ANI) July 6, 2022
కాలుజారి పడిన లాలూ
గత వారం లాలూ తన ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండగా జారి పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం పట్నాలోని పారాస్ ఆస్పత్రికి తరలించారు. లాలూ భుజం, వెన్నెముకకు తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Also Read: Mumbai Rains: చెరువులుగా మారిన రహదారులు- మరో 5 రోజులు తప్పదని IMD హెచ్చరిక!
Also Read: CM Bhagwant Mann Wedding: రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న పంజాబ్ సీఎం- అమ్మాయిని చూశారా?