CM Bhagwant Mann Wedding: రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న పంజాబ్ సీఎం- అమ్మాయిని చూశారా?
CM Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఛండీగఢ్‌లో గురువారం ఆయన వివాహం జరగనుంది.
CM Bhagwant Mann Wedding: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకోనున్నారు. 49 ఏళ్ల మాన్.. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతిని ఛండీగఢ్‌లో గురువారం వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back.
— ANI (@ANI) July 6, 2022
(file pic) pic.twitter.com/tC3Zd2LGfv
తక్కువ మంది మధ్య
అతి తక్కువ మంది సభ్యుల మధ్య మాన్ ఇంట్లోనే ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. వధువు.. భగవంత్ మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాగా చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని సమాచారం.
ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారు.
2015లో
సీఎం భగవంత్ మాన్.. ఇంద్రప్రీత్ కౌర్‌ను మొదటి వివాహం చేసుకున్నారు. అయితే ఆరేళ్ల క్రితం 2015లో వ్యక్తిగత కారణాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరిద్దరికీ ఓ పాప, బాబు ఉన్నారు.
తీర్మానం
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి భాజపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా పంజాబ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
దేశ యువతకు అగ్నిపథ్ పథకం వ్యతిరేకమని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి వరకు తొందరలోనే తీసుకెళ్తామన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం జరిగిన చర్చలో భగవంత్ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు
Also Read: Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి- నలుగురు గల్లంతు, సిమ్లాలో ఒకరు మృతి
Also Read: Spicejet Airlines: 17 రోజుల్లో 7 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు- స్పైస్‌జెట్‌కు అసలు ఏమైంది?