మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సీఎంపైకి దూసుకొచ్చిన బైకర్, డైవ్ చేసి ప్రమాదం నుంచి తప్పించుకున్న ముఖ్యమంత్రి
Nitish Kumar's Security: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కి తృటిలో ప్రమాదం తప్పింది.
Nitish Kumar's Security:
బిహార్ సీఎంకి తప్పిన ప్రమాదం..
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. తన నివాసానికి దగ్గర్లోనే మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ బైక్ ఆయనవైపు దూసుకొచ్చింది. అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ...సీఎం వెళ్తున్న మార్గంలోకి ఆ బైక్ ఎలా వచ్చిందన్నదే అంతు తేలకుండా ఉంది. బైక్ దూసుకొచ్చిన సమయంలో నితీష్ కుమార్ వెంటనే అలెర్ట్ అయ్యారు. పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు ఆ బైక్‌పై వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం భద్రతకు సంబంధించిన విషయం అవడం వల్ల ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఎలా అని అధికారులు గట్టిగానే వాదించినట్టు సమాచారం. SSG అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. పట్నా ఎస్‌ఎస్‌పీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులతో భేటీ అయ్యారు. అయితే...ఈ ఘటనపై ఏ అధికారి కూడా మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.
అలెర్ట్ చేయలేదు..
ముఖ్యమంత్రి వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అటు వైపు ఏ వాహనాన్నీ అనుమతించరు. అలాంటిది...ఓ బైక్ సీఎం దగ్గరి వరకూ వచ్చినా అప్పటి వరకూ ఎవరూ అలెర్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ పని చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ...అతనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించలేదు. పట్నాలో బైకర్స్ గ్యాంగ్ కొద్ది రోజులుగా బీభత్సం సృష్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగటం మరింత కలవర పెడుతోంది. ఇదే రోడ్‌లో బైకర్స్ గ్యాంగ్ రోజూ తిరుగుతున్నట్టు గుర్తించారు. చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పట్నాలో చైన్ స్నాచింగ్ ఘటనలూ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎంనీ టెన్షన్ పెట్టారు. ఇప్పుడే కాదు. గతంలోనూ నితీష్ కుమార్‌కి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
Also Read: Cyclone Biparjoy: కచ్‌వైపు ముంచుకొస్తున్న తుపాను, షెల్టర్ హోమ్‌లు రెడీ చేసిన ప్రభుత్వం