News
News
X

Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం పెళ్లిలో కేజ్రీవాల్- వివాహ భోజనంబు క్రేజీ వంటకంబు!

Bhagwant Mann Wedding: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.

FOLLOW US: 

Bhagwant Mann Wedding: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. ఈ పెళ్లికి దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో ఈ వివాహం జరిగింది.

శుభాకాంక్షలు

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్‌ మాన్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి పంజాబ్‌ సీఎం మెరిసిపోయారు.

" నా సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల. ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉంది.                                           "
-రాహుల్ చద్దా, ఆప్ నేత

భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్‌ మాన్‌కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. కేజ్రీవాల్‌ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లారు. 

విందులో

సీఎం భగవంత్ పెళ్లిలో అతిథులకు ఘుమఘులాడే రకరకాల వంటకాలను పెట్టారు. భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేశారు. ఇంకా ఏమున్నాయంటే

  1. నవరత్న బిర్యానీ
  2. మౌసమీ సబ్జీలు
  3. ఆప్రికాట్‌ స్టఫ్డ్‌ కోఫ్తా
  4. కరాహీ పనీర్‌
  5. తందూరి కుల్చే
  6. దాల్ మఖానీ 
  7. లసగ్న సిసిలియానో,
  8. బుర్రానీ రైత

Also Read: Bhagwant Mann Marriage: పంజాబ్ సీఎం పెళ్లాడిన అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?

Also Read: UK political crisis: యూకేలో మహారాష్ట్ర పాలిటిక్స్ రిపీట్- కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే?

Published at : 07 Jul 2022 01:58 PM (IST) Tags: Bhagwant Mann Marriage Bhagwant Mann Marriage Photo Bhagwant Mann Wife Name

సంబంధిత కథనాలు

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

టాప్ స్టోరీస్

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో