Viral News: చంపేద్దామని భార్య నోట్లో గమ్ పోశాడు - చంపేశానని లొంగిపోయాడు - కానీ ట్విస్ట్ మాత్రం వేరే
Bengaluru: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి చంపేద్దామనుకున్నాడు. తన ప్రయత్నం చేశాడు. చనిపోయిందనుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిలొంగిపోయాడు. కానీ..

Bengaluru Man Suspects Wife Of Infidelity Pours Instant Glue Into Her Mouth: బెంగళూరులోని నేల మంగళ పోలీస్ స్టేషన్‌కు సిద్దలింగ స్వామి అనే వ్యక్తి వచ్చాడు. తాను తన భార్య మంజులను చంపేశానని తనను అరెస్టు చేయాలని కోరాడు. ఈ సిద్దలింగ స్వామి మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే చంపేశాను అంటున్నాడు కాబట్టి వెంటనే అడ్రస్ తీసుకుని ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భార్యపై అనుమానంతో చంపాలనుకుని నోట్లో గమ్ పోసిన కార్పెంటర్
సిద్దలింగ స్వామి కార్పెంటర్ పని చేస్తూంటాడు. భార్య మంజులతో కలిసి నేల మంగళలో నివాసం ఉంటాడు. వారికి పిల్లలులేరు. అయితే సిద్దలింగ స్వామికి తన భార్యపై చాలా అనుమానం ఉంది. ఎవరితో మాట్లాడినా సందేహిస్తూంటాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. దీంతో సిద్దలింగ స్వామి తన భార్యను చంపాలనుకున్నాడు. దానికో ప్లాన్ వేశాడు.
Also Read: భర్త అసహజ శృంగారం - మధ్యలోనే భార్య మృతి - నిర్దోషిగా రిలీజ్ చేసిన హైకోర్టు
పోలీసులకు లొంగిపోయిన కార్పెంటర్ - కానీ భార్య మాత్రం సేప్
కార్పెంటర్ పనిలో ఉపయోగించే పిడిలైట్ గమ్ ను ఓ డబ్బా నిండా తీసుకుని వచ్చాడు. కావాలనే ఓ రోజు అర్థరాత్రి తర్వాత వచ్చాడు. అప్పటికే అతని భార్య నిద్రపోయింది. ఇదే మంచి సమయం అనుకుని ఆమె నోరు తెరిచి.. నోట్లో పిడిలైట్ గమ్ పోసేశాడు. చెక్క అతుక్కుపోయినట్లుగా ఆమె నోరు అతుక్కుపోతుందని శ్వాస కూడా ఆడకచనిపోతుందని అనుకున్నాడు. తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లేలోపు చనిపోతుందని నిర్దారించుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు. పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు వచ్చే సరికి మంజుల చనిపోలేదు. వెంటనే అంబులెన్స్ ను పిలిపంచి ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ లోనే ఆమె నోట్లో పోసిన గమ్ ను తీసేశారు.ఆస్పత్రిలో మంజుల కోలుకుంటున్నారు.
కార్పెంటర్ ను జైలుకు పంపిన పోలీసులు
భార్యను కూడా చంపేశానని పోలీసులుకు లొంగిపోయిన భర్తకు ఈ విషయం తెలిసి షాక్ తిన్నాడు. హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లక తప్పలేదు కానీ..తాను చేయాలనుకున్న పని చేయలేపోయాడు. ఇక భార్య కూడా అతనితో కలిసి ఉండే అవకాశం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

