News
News
X

కాంగ్రెస్‌లో బీబీసీ డాక్యుమెంటరీ చిచ్చు- పార్టీకి రాజీనామా చేసిన ఏకే ఆంటోనీ కుమారుడు

నిన్నటి సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌లో నా బాధ్యతలన్నీ వదులుకోవడం సముచితమని భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు అని తెలిపారు

FOLLOW US: 
Share:

గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్‌ దేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడా డాక్యుమెంటరీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. దీనిప కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై ఆ పార్టీ నేతల కినుకు వహించారు.పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. 

గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ. ఈ విషయంలో కాంగ్రెస్‌ చేపట్టే చర్యలను తప్పుపడుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భారత సంస్థల అభిప్రాయం కంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని అనిల్ ఆంటోనీ గతంలో అన్నారు.

'@incindia @INCKerala నా పదవులకు రాజీనామా చేశాను' అని అనిల్ తన రాజీనామా లేఖ కాపీని పార్టీ నాయకత్వానికి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ బీబీసీ డాక్యుమెంటరీలో గుజరాత్ అల్లర్లతో పాటు మోదీ గురించి ప్రస్తావించారు.

అనిల్ ఆంటోనీ తన రాజీనామా లేఖలో ఏం రాశారు?

నిన్నటి సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్‌లో నా బాధ్యతలన్నీ వదులుకోవడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వానికి, డాక్టర్ శశి థరూర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీకి అనేక విధాలుగా సమర్థవంతంగా తోడ్పడే తనకంటూ ప్రత్యేక బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు అనిల్‌ ఆంటోనీ. మీరు, మీ సహోద్యోగులు, నాయకత్వం మీ చుట్టూ ఉన్న మీ ఆదేశానుసారం వ్యవహరించే చెంచా గుంపుతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని బాగా తెలుసు. అది మాత్రమే మెరిట్‌కు ప్రమాణంగా మారింది. దురదృష్టవశాత్తూ, మాకు అందులో ప్రవేశం లేదు." అని రాసుకొచ్చారు.  Image

డాక్యుమెంటరీ గురించి అనిల్ ఏమన్నారంటే.

బీజేపీతో విభేదాలు ఉన్నప్పటికీ, భారతీయ సంస్థల కంటే బీబీసీ, యూకే మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమైన ధోరణి అని అనిల్ అన్నారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. బీబీసీ ప్రభుత్వ ప్రాయోజిత ఛానల్ అని, భారత్ పట్ల పక్షపాతంతో వ్యవహరించిన చరిత్ర ఉందని అనిల్ ఆంటోనీ ట్వీట్ చేశారు. ఇరాక్ యుద్ధానికి ప్రణాళిక రచించింది జాక్ స్ట్రా అని ఆయన అన్నారు. 2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ పై దాడి చేశాయ.

అనిల్ ఆంటోనీ ఇటీవలి వరకు కాంగ్రెస్ కేరళ విభాగం డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని వివిధ రాష్ట్ర కాంగ్రెస్ శాఖలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లర్ల సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

Published at : 25 Jan 2023 11:56 AM (IST) Tags: CONGRESS Kerala BBC Documentary AK Antony

సంబంధిత కథనాలు

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా

Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్

Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం