(Source: ECI/ABP News/ABP Majha)
cVIGIL App: సి-విజిల్ యాప్ అంటే ఏంటి? ఎన్నికల టైంలో మనం దాన్ని ఎలా వాడాలి? ఇలా కంప్లైంట్ చేసేయండి
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడడం, అభ్యర్థుల దుష్ర్పవర్తన, ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి వాటిని పౌరులు గుర్తించినట్లయితే, వెంటనే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల కోసం గంట మోగిన సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ రాబోయే ఎన్నికలను ప్రీఫైనల్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను శనివారం (డిసెంబరు 9) ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగకుండా సి-విజిల్ అనే మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నట్లుగా సుశీల్ చంద్ర ప్రకటించారు. ఈ ఫ్రీ యాప్ అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడొచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఏవైనా ఉల్లంఘనలు జరుగుతున్నా, అవకతవకలు జరిగినా ఈ సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. వెంటనే ఎన్నికల సంఘం ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపు స్పందిస్తుందని చెప్పారు.
ఈ సి-విజిల్ యాప్ ద్వారా పౌరులు ఎవరైనా ఎన్నికల్లో జరిగే అక్రమాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడడం, అభ్యర్థుల దుష్ర్పవర్తన, ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి వాటిని పౌరులు గుర్తించినట్లయితే, వెంటనే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికప్పుడే తప్పునకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు యాప్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఎలాంటి గుర్తింపు లేకుండా అనామక వ్యక్తిగా కూడా ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వచ్చు.
సి-విజిల్ ఎలా వాడాలంటే..
సి-విజిల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ నెంబరు సాయంతో లాగిన్ అవ్వచ్చు. పేరు, ఇతర గుర్తింపు బయటపెట్టడం ఇష్టం లేని వారు అనామక వ్యక్తిగా కూడా లాగిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఇలా గుర్తింపు లేకుండా లాగిన్ అయ్యి ఫిర్యాదు చేస్తే.. అందుకు సంబందించిన స్టేటస్ అప్‌డేట్లు మాత్రం అందవు. ఒక్కసారి లాగిన్ అయితే, ఉల్లంఘనకు సంబంధించిన డిజిటల్ ప్రూఫ్ కోసం సంబంధిత ఫోటోలను లేదా వీడియోను (2 నిమిషాలలోపు) రికార్డు చేయాలి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సాంకేతికత సాయంతో ఆటోమేటిగ్గా లోకేషన్ నమోదు అవుతుంది.
ఫిర్యాదును ఎలా ట్రాక్ చేయాలంటే..
ఫిర్యాదు నమోదైన అనంతరం ఒక విశిష్ట ఐడీ నెంబరు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ ఐడీ ద్వారా అదే యాప్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇలా ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఒక్కోదానికి ఒక్కో యూనిక్ ట్రాకింగ్ నెంబరు వస్తుంది. ప్రతిదాని ఎంటర్ చేసి స్టేటస్ అప్ డేట్స్ తెలుసుకోవచ్చు.
Also Read: Manipur : మణిపూర్‌లో "ఆ చట్టమే" ఎన్నికల అంశం ! బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ..
Also Read: PM Modi Call to Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్... 317జీవోపై ప్రధాని ఆరా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి