అన్వేషించండి

Amit Shah on Reservations: మత ఆధారిత రిజర్వేషన్లు సరికాదు, రాజ్యాంగాన్ని మార్చడం ఆరోపణల్ని ఖండించిన అమిత్ షా

Amit Shah About Reservations: మతం ఆధారంగా రిజర్వేషన్లు సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగం రద్దు, మార్పులు చేయాలని ఆలోచించడం లేదన్నారు.

Amit Shah With ABP News: కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు బీజేపీ ఎలక్షన్ వ్యూహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ABP  newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని మార్చుతారన్న కాంగ్రెస్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్లను సైతం మార్చే ఉద్దేశం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.

ఈసారి బీజేపీకి 400 సీట్లు..
ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 సీట్లు సాధించి తీరుతుందని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దశలలో ఓటింగ్ జరగగా,అంచనా కన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. కానీ బీజేపీ దాని మిత్రపక్షాలు ఈ రెండు దశల ఎన్నికల్లో 100 సీట్లకు పైగా నెగ్గుతామని పేర్కొన్నారు. అలాంటప్పుడు తమకు ఓటమి ఎలా వస్తుందన్నారు. కానీ బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్, I.N.D.I.A కూటమి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో 80 కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఎన్డీఏ సర్కార్ మార్పు తీసుకువచ్చిందని, ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కడతారని చెప్పారు. 

ఎన్డీఏ పాలనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అర్హులైన నిరుపేదలకు సొంత ఇండ్లు, ఉచితంగా రేషన్‌ బియ్యం, కరోనా వ్యాక్సిన్‌ సైతం ప్రజల వద్ద ఒక్క రూపాయి తీసుకోకుండానే పంపిణీని చేశామని తమ ప్రభుత్వ విజయాలను అమిత్ షా వివరించారు. నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధాని అయితే, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరిస్తుందన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం లాంటి సమస్యలతో పాటు అంతర్గత భద్రత సమస్యలను సమర్ధవంతంగా వ్యవహరించినట్లు చెప్పారు. 

ప్రతిపక్షాల ఆరోపణలపై అమిత్ షా రియాక్షన్ ఇదీ..
మెజార్టీ స్థానాల్లో గెలిచాక, కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు, లేక రద్దు చేస్తామని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే గత రెండు పర్యాయాలు కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం నడిచిందని, కానీ ఏనాడూ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు అమిత్ షా. రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉన్నా, గత పదేళ్లలో ఆ పని చేయలేదని పేర్కొన్నారు. మాకు ఉన్న మెజారిటీని జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్  370 రద్దు చేయడానికి, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేయడం, సీఏఏ లాంటి విధానాన్ని అమలు చేయడం, అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి వినియోగించినట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని రాహుల్ కు చురకలు అంటించారు. పేదలను, దళితుల్ని, గిరిజనుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, వారితో పాటు బీసీల హక్కుల కోసం పోరాటం చేశామన్నారు. వెనుకబడిన తరగతులకు మోదీ రిజర్వేషన్లు కల్పించగా, కాంగ్రెస్ మాత్రం దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. 

ST-SC-OBC రిజర్వేషన్లను తగ్గిస్తారా? 
ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కర్ణాటకలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఒకే మతానికి చెందిన అందర్నీ వెనుకబడిన వారిగా వర్గీకరించవచ్చా అని ప్రశ్నించారు. ఏ సర్వే లేకుండా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ శాతాన్ని కాంగ్రెస్ తగ్గించిందని షా ఆరోపించారు.

మతం ఆధారంగా రిజర్వేషన్లను ఆయన వ్యతిరేకించారు. అది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు, బీజేపీ మేనిఫెస్టోకు అసలు సంబంధం లేదన్నారు. అణ్వాయుధాలను అంతం చేస్తామని సీపీఐఎం ఇచ్చిన హామీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశ భద్రతకు విఘాతమని, వీనిపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అమిత్ షా ప్రశ్నించారు. PMLA చట్టం గురించి మాట్లాడుతూ ఈడీ, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలన్నారు. అవినీతి కేసుల్లో ఉదాసీనత చూపకూడదన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ఆరోపణల్ని ఖండించిన అమిత్ షా, కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటే బెటర్ అని అభిప్రాయపడ్డారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget