mohammed zubair Remand : జర్నలిస్ట్ జుబేర్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీ - అరెస్ట్‌ను ఖండించిన విపక్షాలు !
అల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్‌కు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
mohammed zubair Remand : ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2018లో చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ సోమవారం(జూన్ 27న) అరెస్ట్ చేశారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్
2018లో చేసిన ఓ ట్వీట్ చేసిన కేసులో జుబేర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబేర్‌నే. జుబేర్ రెచ్చగొట్టే ట్వీట్స్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ప్రజల్లో ద్వేషభావాన్ని పెంచేలా జుబేర్ ట్వీట్లు ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2018లో ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. దాని కోసం ఓ సినిమా క్లిప్‌ను కూడా వాడారు. ఈ కేసులో జుబేర్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మతపరమైన భావాలను కించపరిచినట్లు కేసు నమోదైంది.
ఇప్పటి శ్రీలంకలా అప్పట్లో భారత్ మారకుండా కాపాడింది పీవీనే ! ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ...
మతపరమైన మనోభావాలను కావాలనే దెబ్బతీయాలన్న కక్ష్యతో సోషల్ మీడియాలో జుబేర్ ఇలాంటి పోస్టులు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి జుబేర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలను జుబేర్ వక్రీకరించినట్లు కూడా నుపుర్ శర్మ ఫిర్యాదు చేశారు. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. జుబేర్ ను మరో కేసులో అరెస్ట్ చేశారని జుబేర్ సహ ఉద్యోగి, ఆల్ట్ న్యూస్ మరో సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ఆరోపించారు.
'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!
జూబేర్‌ను గతంలోనూ అరెస్ట్ చేశారు. హిందూత్వ నేతలు యతి నరసింగానంద్, మహంత్ బజరంగ్ ముని, ఆనంద్ స్వరూప్ తదితరులు చేసిన వ్యాఖ్యలపై జుబేర్ వార్తా కథనాలు రాశారు. ఈ అంశంపై అప్పట్లో జుబేర్‌ను యుపి పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఐపిసిలోని 295ఎ కింద కేసు నమోదు చేశారు. జుబేర్ అరెస్టును విపక్షాలు ఖండించాయి . బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ జుబేర్‌కు మద్దతుగా ట్రెండింగ్ నిర్వహిస్తున్నారు.