News
News
X

Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!

Agnipath Recruitment Scheme: అగ్నిపథ్‌లో భాగంగా నౌకదళంలో అగ్నివీరులుగా చేరే యువతులకు నావికా దళం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

FOLLOW US: 

Agnipath Recruitment Scheme: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై భారత నౌకా దళం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ నేవీలోకి తీసుకునే ఫస్ట్ బ్యాచ్ అగ్నివీరుల్లో 20 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేవీకి చెందిన వివిధ ప్రాంతాల్లో వీరిని రిక్రూట్ చేస్తామని పేర్కొంది. 2022లో మొత్తం 3 వేల మంది అగ్నివీరులను తీసుకుంటామని ప్రకటించింది.

10 వేల మంది

నౌకాదళంలో మొదటి బ్యాచ్ అగ్నివీరుల కోసం జులై 1న రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 10 వేల మంది యువతులు ఇందుకోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను జూన్ 15- జులై 30 వరకు ప్రాసెస్ చేస్తారు.
 
" భారత నౌకాదళంలోకి తీసుకునే అగ్నివీరుల నియామకాల్లో ఎలాంటి లింగ భేదం లేదు. పురుషులు, మహిళలు ఇద్దరినీ ఇందులోకి తీసుకుంటాం. భారత నౌకాదళానికి చెందిన వివిధ నౌకల్లో 30 మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు అగ్నివీరుల నియామకాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. వారిని యుద్ధ నౌకల్లో కూడా విధుల కోసం పంపవచ్చు.                                                         "
-దినేశ్ త్రిపాఠీ, వైస్‌ అడ్మిరల్
 
అప్పటి నుంచి
 
నౌకాదళానికి చెందిన మొదటి బ్యాచ్ అగ్నివీరుల ట్రైనింగ్.. 2022 నవంబర్ 21 నుంచి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అలానే అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ హింసాత్మక ఆందోళనలకు పాల్పడిన వారికి ఆర్మీలో చేరే అవకాశం లేదని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ ప్రకటించారు.
 
అగ్నివీరులుగా చేరే ప్రతి ఒక్కరూ తాము ఎలాంటి హింసాత్మక ఆందోళనల్లోనూ పాల్గొనలేదని చెబుతూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులు తెలిపారు.  ఆ తర్వాత పోలీస్ వెరిఫికెషన్ జరుగుతుందని, అప్పుడే రిక్రూట్ చేసుకుంటామని వెల్లడించారు. 
 
జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, బంగాల్, హరియాణా ఇలా చాలా రాష్ట్రాల్లో హింసాత్మకంగా ఆందోళనలు జరిగాయి. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకొని పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
 
Published at : 05 Jul 2022 02:50 PM (IST) Tags: Indian Navy Agnipath Recruitment Scheme 20 Percent Women first batch of Agniveers

సంబంధిత కథనాలు

Noida Twin Towers :   40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

Noida Twin Towers : 40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

టాప్ స్టోరీస్

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!