ABP C-Voter Survey: కాంగ్రెస్ అధ్యక్షుడెవరు? సర్వేలో ప్రజల షాకింగ్ రియాక్షన్
ABP C-Voter Survey: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిపై ఏబీపీ న్యూస్, సీ-ఓటర్ క్విక్ సర్వే నిర్వహించింది. దీంతో ప్రజలు చాలా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
ABP News Survey On Congress President: దేశంలో 2024 ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయం మొదలైపోయింది. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే అంతకంటే ముందు జరిగే 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను యుద్ద సన్నద్దంగా మార్చుకోనున్నాయి రాజకీయ పార్టీలు.
ఎన్నికల సన్నద్దంలో భాగంగానే కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో రెడీ అవుతోంది. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపికను తెరపైకి తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియను ఇప్పుడు పూర్తి చేస్తోంది. చాలా కాలం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తిని అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టి గేమ్ ఆడాలని ప్లాన్ చేసింది. ఈ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్నారు.
ఇద్దరిలో గెలిచేది ఎవరు.. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు కాబోతున్నారు... ఈ అధ్యక్ష ఎన్నికలపై ప్రజల స్పందన ఏంటి... ఇలాంటి చాలా ప్రశ్నలపై జనాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయ వాతావరణంపై ప్రతివారం ప్రజల ఆలోచన సరళిని చెప్పే ఏబీపీ న్యూస్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై కూడా సీ ఓటర్‌తో కలిసి క్విక్ సర్వే చేసింది.
క్విక్ సర్వే బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగింది. ఈ సర్వేలో 5 వేల 291 మందితో సి ఓటర్ ప్రతినిధులు మాట్లాడారు. సర్వే ఫలితాలు పూర్తిగా ప్రజల అభిప్రాయాలపై ఆధార పడి ఉంది.
గాంధీ కుటుంబం ప్రజల ఎంపికేనా?
ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడు కావాలనే ప్రశ్న అడిగితే... ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రజలు షాకింగ్ విషయాలు చెప్పారు. అదే టైంలో 28 శాతం మంది ప్రజలు శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 37 శాతం మంది ప్రజలు అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలని భావించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్ 17న జరుగనుంది. కొత్త అధ్యక్షుడి పేరును అక్టోబర్ 19న ప్రకటిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు కావాలి?
సోర్స్: సి ఓటర్
మల్లికార్జున ఖర్గే - 35%
శశి థరూర్ - 28%
గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా - 37%
మల్లికార్జున ఖర్గే గురించి ప్రజల అభిప్రాయం ఏమిటి?
సి ఓటర్ సర్వేలో, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైతే, గాంధీ కుటుంబానికి ఆయనో రబ్బర్ స్టాంప్‌లో ఉంటారా అని ప్రశ్న వేస్తే. చాలా దిగ్భ్రాంతికరమైన రియాక్షన్ వచ్చింది. మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైతే గాంధీ కుటుంబానికి రబ్బర్ స్టాంప్‌లా ఉంటారని సర్వేలో 60 శాతం మంది చెప్పారు. కదాని 40 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
గమనిక- సి ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో 5 వేల 291 మందితో మాట్లాడారు. సర్వే ఫలితాలు పూర్తిగా ప్రజల ఇంట్రాక్షన్‌పైనే ఆధారపడి ఉంటాయి. సర్వేలో ఎర్రర్ మార్జిన్ +/- 3 నుంచి +/- 5 శాతం.