Tsunami in Russia and Japan | బాబా వంగా చెప్పిందే జరుగుతుందా ? | ABP Desam
బాబా వంగా ఒక బల్గేరియన్ భవిష్యత్ వక్త. అసలు పేరు వంగెలియా పాండెవా గుష్టెరోవా. భవిష్యత్తును చూడగలగడం వల్ల ప్రజలు ఆమెను బాబా వంగా అని పిలుస్తారు. ఆమె 1911లో బల్గేరియాలో జన్మించారు. 1996లో మరణించే ముందు 5079 వరకు భవిష్యవాణి చెప్పారు. వీటిలో ఏవి నిజం? ఏవి కల్పితం అన్నది కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. బాబా వంగా 9/11 దాడి, 2004 సునామీ, బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికవడం, సోవియట్ యూనియన్ పతనం వంటివి ముందుగానే చెప్పారు.
బాబా వంగా 2025ను విషాదంతో నిండిన సంవత్సరంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, మానవ నాగరికత పతనం ప్రారంభమవుతుందని జ్యోతిష్యం చెప్పారు. ఇప్పుడు బాబా వంగా చేపినట్టుగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. సునామి గురించి కూడా బాబా వంగా ముందుగానే చెప్పారు. జపాన్ రష్యాలో పరిస్థితి అసలు బాలేదు. సునామి హెచ్చరికలు జారీ చేసారు. చాలా పెద్ద ఎత్తులో రాకాసి అల్లలు ఎగసి పడుతున్నాయి. వరదల విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జపాన్ రష్యాలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.





















