Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Five States Exit Polls: సాయంత్రం 5.30 గంటల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ABP CVoter ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
Telangana Elections 2023 Exit Polls:
సాయంత్రమంతా ఎగ్జిట్ పోల్స్ హడావుడి..
5 రాష్ట్రాల ఎన్నికల్లో (Five States Elections) అందరి ఫోకస్ తెలంగాణపైనే. దక్షిణాది రాష్ట్రం కావడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉందన్న అంచనాలు ఇక్కడి ఎన్నికలపై ఇంట్రెస్ట్ పెంచాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. "ప్రజలు మార్పు కోరుకుంటున్నారు" అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. అటు అధికార BRS పార్టీ మాత్రం "కాంగ్రెస్‌ని నమ్మితే రాష్ట్రాన్ని మునిగిపోతుంది" అని కౌంటర్‌లు ఇస్తూ ప్రచారం సాగించింది. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రికార్డు సృష్టిస్తారని చాలా ధీమా వ్యక్తం చేసింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ రోజే తేలిపోతుంది వచ్చే ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఎవరు రూల్ చేస్తారో. ఆలోగా ఎగ్జిట్ పోల్స్ హడావుడి చేయనున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనా వేయనున్నాయి. ఇందులో నిజానిజాలు ఎన్ని అన్నది పక్కన పెడితే ఎన్నికల సందడిని మరింత పెంచేస్తాయి ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 5.30 గంటల తరవాత ఎగ్జిట్ పోల్స్‌ని విడుదల చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వీటిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది.
ABP CVoter ఏం చెప్పనుంది..?
ఇప్పటికే అన్ని సంస్థలు అంచనాల్ని సిద్ధం చేసుకున్నాయి. వీటిలో అన్నీ నిజాలు కావు. అన్నీ అబద్ధాలూ కావు. కానీ ఆ అంచనాలకు ఓ క్రెడిబిలిటీ ఉండాలి. ఈ విషయంలో ABP CVoter Exit Polls ఎప్పటికీ టాప్‌లోనే ఉంటుంది. ఇవాళ సాయంత్రం (నవంబర్ 30) 5.30 గంటల నుంచి తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ని (Telangana Election Exit Polls) విడుదల చేయనుంది. ఎగ్జిట్ పోల్స్‌లోనే కాదు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముందస్తు సర్వేల్లోనూ ABP CVoter Survey ప్రతిసారి విశ్వసనీయతను చాటుకుంటోంది. దాదాపు ఫలితాలకు దగ్గరగానే అంచనాలు వేస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉందని అంచనా వేసినట్టుగానే ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అందుకే తెలంగాణ ఎన్నికలపై ABP CVoter ఎగ్జిట్ పోల్స్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశముందని ఎన్నికల ముందు జరిగిన ABP CVoter Surveyలో వెల్లడైంది. ఆ తరవాత సమీకరణలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వాటి ఆధారంగానే ఎగ్జిట్ పోల్స్‌ని విడుదల చేస్తారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా చూడండి..
ABP CVoter ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కింద లింక్‌లు క్లిక్ చేసి లైవ్‌గా చూడచ్చు
Live TV: https://news.abplive.com/live-tv
ABP Live (English): news.abplive.com/
ABP News (Hindi): www.abplive.com/
ABP Network YouTube: https://www.youtube.com/watch?v=nyd-xznCpJc