News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Sanjay Singh Arrest: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ అరెస్ట్ అయ్యారు.

FOLLOW US: 
Share:

 Sanjay Singh Arrest:

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే సంజయ్ సింగ్‌ గురించి ఈడీ చాలా సార్లు ప్రస్తావించింది. ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు ఉంది. ఆయన ఇంట్లో తొలిసారి సోదాలు నిర్వహించింది ఈడీ. రోజంతా సోదాలు చేసిన తరవాత సాయంత్రానికి అరెస్ట్ చేసింది. అరెస్ట్‌కి ముందు సుదీర్ఘంగా విచారించింది. ఎన్నో ప్రశ్నలు వేసింది. 

పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ చెబుతోంది. సంజయ్ సింగ్ ఇంటి ఎదుట ఆయన మద్దతుదారులు చేరుకున్నారు. ఈడీ సోదాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు. సత్యేంద్రజైన్‌తో పాటు మనీశ్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఇంకా లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ విచారణ ఓ కొలిక్కి రాలేదు. సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం...గతేడాకి అక్టోబర్ 1వ తేదీన దినేష్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారాడు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లిక్కర్‌ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్టు సీబీఐకి చెప్పాడు. సంజయ్ సింగ్‌ ద్వారానే మనీశ్ సిసోడియాని కలిసినట్టు వివరించాడు. సంజయ్ సింగ్ సలహాతోనే రెస్టారెంట్‌ ఓనర్‌లతో మాట్లాడి రూ.82 లక్షల చెక్‌లు కలెక్ట్ చేసినట్టు చెప్పాడు. ఆ డబ్బులనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఈ డబ్బంతా మనీశ్ సిసోడియాకి ఇచ్చినట్టు అంగీకరించాడు. 

Published at : 04 Oct 2023 05:40 PM (IST) Tags: Money Laundering Case Delhi Excise Policy Case AAP MP Sanjay Singh  Sanjay Singh Arrest

ఇవి కూడా చూడండి

Delhi Air Pollution: బాబోయ్ మేము ఉండలేం, ఇక్కడి నుంచి వెళ్లిపోతాం - సర్వేలో ఢిల్లీ, ముంబై వాసులు

Delhi Air Pollution: బాబోయ్ మేము ఉండలేం, ఇక్కడి నుంచి వెళ్లిపోతాం - సర్వేలో ఢిల్లీ, ముంబై వాసులు

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Natural Disasters: దేశంలో వేగంగా మారిపోతున్న వాతావరణం, వేలాదిగా మరణాలు

Natural Disasters: దేశంలో వేగంగా మారిపోతున్న వాతావరణం, వేలాదిగా మరణాలు

Ashwini Vaishnaw: 2026లో దూసుకెళ్లనున్న తొలి బుల్లెట్ రైలు

Ashwini Vaishnaw: 2026లో దూసుకెళ్లనున్న తొలి బుల్లెట్ రైలు

Anju Nasrullah: ఇండియాలో అడుగుపెట్టిన అంజు, ఎందుకంటే?

Anju Nasrullah: ఇండియాలో అడుగుపెట్టిన అంజు, ఎందుకంటే?

టాప్ స్టోరీస్

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?