Arvind Kejriwal: '4 రాష్ట్రాల్లో గెలిచారు ఏం లాభం? పంజాబ్‌లో మా పనితనం చూడండి'
పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ ఇప్పటికే తన పని మొదలుపెట్టిందని, కానీ 4 రాష్ట్రాల్లో గెలిచిన భాజపా ఇంకా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేకపోయిందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శల డోసు పెంచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట గెలిచిన భాజపా ఇప్పటివరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.ఎందుకంటే వారి పార్టీలోనే అంతర్యుద్ధం నెలకొందని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు పంజాబ్‌లో ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పని మొదలుపెట్టినట్లు తెలిపారు.
దిశానిర్దేశం
కేబినెట్ మంత్రులతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. దిగ్గజాలను ఓడించిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రితో కలిపి పంజాబ్ కేబినెట్‌లో మొత్తం 18 మంది మంత్రులు ఉన్నారు. ప్రభుత్వం కావాలంటే కేబినెట్ మంత్రులను పెంచుకోవచ్చు.
భారీ విజయం
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్ 58,206 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోసారి అధికారం దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆప్ భారీ షాక్ ఇచ్చింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్ధూ సహా అగ్రనాయకులు అందరూ ఆప్ దెబ్బకు ఇంటిముఖం పట్టారు.
అంతేకాకుండా శిరోమణి అకాలీ దళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఓటమిపాలయ్యారు. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరాజయం పొందారు.
Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!
Also Read: Watch Video: మ్యాచ్ మధ్యలో కూలిన గ్యాలరీ- 200 మందికి గాయాలు, వీడియో చూశారా?