Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
30 కిలోల హైగ్రేడ్ కొకైన్ డ్రగ్స్‌ను జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిలోని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బేనీహాల్ వద్ద డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 30 కిలోల హైగ్రేడ్ కొకైన్ డ్రగ్స్‌ను జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిలోని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బేనీహాల్ వద్ద డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసున్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలోని బేనీహాల్ వద్ద డ్రగ్స్ ముఠా కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. డ్రగ్స్ ముఠా కోసం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానం ఉన్న ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా అందులో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైగ్రేడ్ కొకైన్ గుర్తించిన పోలీసులు, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.300 కోట్లు ఉంటుందని జమ్మూ జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు.
దేశంలో పంజాబ్‌లోనే అత్యధికంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఏటా సుమారు 7,500 కోట్ల విలువైన డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో హెరాయిన్ వాటా రూ.6,500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల మేరకు పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారిపై బాలీవుడ్‌లో ఉడ్తా పంజాబ్ పేరుతో సినిమా కూడా వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అవగతం చేసుకోవచ్చు.
పంజాబ్‌లో సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 1.23 లక్షల మందికి పైగా పంజాబీలు హెరాయిన్ వాడుతున్నారు. కొందరు ఓపియం ఇతర పదార్థాలు వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. మరో 75 వేల మంది డ్రగ్స్ ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు. డ్రగ్స్ వినియోగంతో నరాలు దెబ్బతినడంతోపాటు యువత శక్తి సామర్థ్యాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని అంటున్నారు.