India Covid Cases: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 26,964 కేసులు నమోదు
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 26,964 మందికి కరోనా నిర్ధారణ అయింది.
ఇండియాలో కొత్తగా 26,964 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 383 మంది మరణించారు. ఒక్కరోజే 34,167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 3,35,31,498 కరోనా కేసులు నమోదవ్వగా.. 4,45,768 వైరస్ కారణంగా చనిపోయారు. 3,27,83,741 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,09,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 15,92,395 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం ఇప్పటివరకు కొవిడ్ పరీక్షల సంఖ్య 55,66,28,112 మందికి చేశారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/P6bybtMOOY
— ICMR (@ICMRDELHI) September 22, 2021
దేశంలో ఇప్పటివరకు 82,65,15,754 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 75,57,529 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
మరోవైపు చిన్నారులకు 18 ఏళ్లలోపు వారు కరోనాను ఎదుర్కొనే టీకా మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన 'కొవాగ్జిన్' తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. ఈ ప్రయోగాల సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు వచ్చే వారం అందజేస్తామని సంస్థ ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది.
కరోనా మూడో వేవ్ భయాల కారణంగా వీలైనంత మందికి వ్యాక్సిన్ అందేలా తాము కృషి చేస్తున్నట్లు బయోటెక్ సంస్థ వెల్లడించింది. కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.
సెప్టెంబర్ నెలలో 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామన్నారు. అక్టోబర్‌లో వీటి సంఖ్య 5.5 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్