Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?
కరోనా ప్రభావం తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మరో కొత్త వేరియంట్ వణికిస్తోంది. అది ఇండియాకు కూడా వచ్చేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని అందరూ భావిస్తున్న సమయంలో.. కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ SARS-CoV-2 వేరియంట్‌ను గుర్తించింది. దక్షిణాఫ్రికాలో వ్యాప్తిచెందుతున్న ఈ వేరియంట్.. ఇండియాలోకి కూడా వచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి ఇప్పటి వరకూ 94 మంది వ్యక్తులు.. బెంగళూరు చేరుకున్నారని.. రూరల్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్ చెప్పారు. అయితే అందులో ఇద్దరికీ కొవిడ్ పాజిటీవ్ గా తేలింది. 10 'హై రిస్క్' దేశాల నుంచి ఇప్పటివరకు 584 మంది ఇక్కడికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు.
బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కొవిడ్-19 పరీక్ష చేశారు. వారికి పాజిటివ్ గా తేలింది. అయితే ప్రాణాంతక వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ఉందా అని ఆరోగ్య అధికారులు పరీక్షలు చేస్తున్నారు. వారు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారో లేదో తదుపరి పరీక్ష నివేదికలు నిర్ధారిస్తాయని.. పరీక్ష ఫలితాలు రావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కర్ణాటక ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వారు రాగానే పరీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ఎపిడెమియోలాజికల్, క్లినికల్ కోరిలేషన్‌ను శాస్త్రవేత్తలు పూర్తిగా ఆవిష్కరించలేదు. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ప్రభావం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం కష్టం. దక్షిణాఫ్రికా చేపట్టిన ప్రయోగాల్లో, B.1.1.529 రోగనిరోధకతపై పరిశీలించారు. ఆసుపత్రిలో చేరడంతో పాటు B.1.1.529తో సంబంధం ఉన్న ఫలితాలను పర్యవేక్షించడానికి రియల్ టైమ్ సిస్టమ్‌ను ఆ దేశం ఏర్పాటు చేసింది.
Also Read: Omicron Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం... హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలెర్ట్..
Also Read: Omicron Modi Review : ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !
Also Read: బుందేల్‌ఖండ్‌లో పట్టు సాధిస్తే నిలబడినట్లే .. యూపీలో ప్రియాంక గాంధీ ప్లాన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి