Omicron Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం... హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలెర్ట్..
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలెర్ట్ అయ్యింది. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో పటిష్ట చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ ఉద్ధృతి అంతగా లేదు. పరిస్థితులు యథాస్థితికి వస్తున్నాయి అనుకున్న టైంలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. భారత్ లో ఈ కేసులు ఇప్పటి వరకూ నమోదు కాకపోయినా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. వారి శాంపిల్స్ ముంబాయి పంపినట్లు తెలుస్తోంది.
Also Read: ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !
రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో అలెర్ట్
కోవిడ్ కొత్త వేరియంట్ ఆందోళనతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ లకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు సిబ్బందిని అలెర్ట్ చేసింది. స్క్రీనింగ్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎయిర్ పోర్టు సిబ్బంది. ఈ కొత్త వేరియంట్ కేసులు బోస్ట్వావా, దక్షిణాఫ్రికా, బెల్జియం, హాంగ్ కాంగ్ దేశాల్లో నమోదయ్యాయి.
కొత్త వేరియంట్ నివారణకు పటిష్ట చర్యలు
ఈ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు వైద్య సిబ్బంది ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో సహా దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని ప్రత్యేక ఆసుపత్రిల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read: దక్షిణాఫ్రికా నుంచి కొత్త కరోనా వైరస్ ముప్పు.. దేశంలో హై అలర్ట్ !
Also Read: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి