India Corona Cases: భారత్ లో కొత్తగా 14,306 కరోనా కేసులు నమోదు
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 14,306 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 14,306 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 443 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 18,762 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో కేరళలో 8,538 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఆ రాష్ట్రంలో 71 వైరస్ కు బలయ్యారు. నిన్నటి కంటే 1500పైగా కేసులు ఇవాళ తగ్గాయి. నిన్న 18,762 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 3.41 కోట్లకు చేరగా.. 3.35 కోట్లమందికి పైగా కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 25, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/Q63rqPjFt5 pic.twitter.com/IGWm0BsaFX
ఇతర దేశాల్లోనూ..
అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 17,580 మందికి వైరస్ సోకగా.. మరో 157 మంది ప్రాణాలు కోల్పోయారు.రష్యాలో 35,660 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,072 మంది చనిపోయారు. బ్రిటన్‌లో కొత్తగా 39,962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 72 మంది మృతి చెందారు.
కరోనా కొత్త వేరియంట్
ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను మార్చుకుని ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతోంది. అయితే తాజాగా యూకేలో వెలుగులోకి వచ్చిన ఏవై. 4.2 హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లకు భిన్నంగా అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌పై భారత్ కూడా హై అలర్ట్‌లో ఉంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ ఏవై. 4.2 వైరస్ గుర్తులు కనబడలేదు. ఇప్పటివరకు 68 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ వేరియంట్ అందులో లేదు.
"ఈ వేరియంట్‌పై మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం. మరిన్ని శాంపిల్స్‌ను పరీక్షిస్తాం. అంతర్జాతీయ ప్రయాణికులపై మరింత దృష్టి పెడతాం. ఈ ఏవై. 4.2 వేరియంట్ ఉన్న రోగులను వెంటనే గుర్తిస్తాం." - నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీనియర్ అధికారి
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు