News
News
X

INS Vikrant: హిందూ మహాసముద్రంపై విక్రాంత్‌ రైడ్‌... తిరుగులేని శక్తిగా భారత్...

త్వరలో తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలోకి..స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యుద్ధ విమాన వాహక నౌక విక్రాంత్ చేరేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.

FOLLOW US: 
Share:

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్‌ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్‌ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకుని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్‌ సేవలందించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్‌ క్లాస్‌ నౌక ఇది. 1997లో విక్రాంత్‌ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో విక్రాంత్‌ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది.  విక్రాంత్ పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు, బరువు దాదాపు 40వేల టన్నులు.. నిర్మాణశైలి విషయానికొస్తే 5 సూపర్ స్టక్టర్లు, 14 డెక్ లు, 2300 కంపార్ట్ మెంట్లున్నాయి.

విక్రాంత్‌ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్‌ నేవీకి చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ సంస్థ నౌక డిజైన్‌ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్‌ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్‌ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్‌ ట్రయల్స్‌ పూర్తయ్యాయి.

ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్‌ సీ ట్రయల్‌ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్‌ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్‌ ప్రొపైల్లర్‌ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్‌ పంప్స్, విద్యుత్‌ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్‌ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. సముద్రంలో ఐఏసీ విక్రాంత్‌ ట్రయల్స్‌ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ కామెంట్ చేసింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్‌ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది.

రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతోపాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్‌ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్‌. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్‌ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది..పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్‌ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది.  

Published at : 05 Aug 2021 10:52 AM (IST) Tags: India's first indigenous Aircraft Carrier INS Vikrant Completed Sea trials Planned induction into Indian Navy

సంబంధిత కథనాలు

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!

DMHO Recruitment: కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!

Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!

Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!

Vijay Devarakonda: బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ కాంబో రిపీట్ - కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ, పరశురామ్!