India Covid Cases: దేశంలో కొత్తగా 28,591 కోవిడ్ కేసులు.. 338 మంది మృతి
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 28,591 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది.
భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 28,591 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 338 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కోవిడ్ బాధితుల్లో 34,848 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో రికవరీల సంఖ్య 3,24,09,345కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,84,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 73.82 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 54.18 కోట్ల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. నిన్న (సెప్టెంబర్ 11) ఒక్క రోజే 15,30,125 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
#CoronaVirusUpdates:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 12, 2021
📍Total #COVID19 Cases in India (as on September 11, 2021)
▶97.51% Cured/Discharged/Migrated (3,24,09,345)
▶1.16% Active cases (3,84,921)
▶1.33% Deaths (4,42,655)
Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active cases+Deaths#StaySafe pic.twitter.com/F8dULyv0DJ
తాజాగా నమోదైన కోవిడ్ కేసుల్లో 20,487 కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఇక కేరళలో నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 181 మంది మరణించారు. మహారాష్ట్రంలో 3,075 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
India reports 28,591 new #COVID19 cases, 34,848 recoveries, and 338 deaths in last 24 hours, as per Health Ministry.
— ANI (@ANI) September 12, 2021
Total cases: 3,32,36,921
Active cases: 3,84,921
Total recoveries: 3,24,09,345
Death toll: 4,42,655
Total vaccination: 73,82,07,378 (72,86,883 in last 24 hours) pic.twitter.com/6JoT6wJkPC
Of 28,591 new #COVID19 cases and 338 deaths reported in the last 24 hours in India, Kerala recorded 20,487 new cases and 181 deaths.
— ANI (@ANI) September 12, 2021
Also Read: Elon Musk: ముందు 'మేక్ ఇన్ ఇండియా'.. తర్వాత పన్ను రాయితీ.. ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన కేంద్రం