India population: 146 కోట్లకు చేరిన భారత జనాభా - కానీ జననాల రేటు తగ్గుదల -అసలు డేంజర్ ముంచుకొస్తోందా?
Fertility rate : కొంత మంది రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నట్లుగా భారత్ లో జననాల రేటు తగ్గుతోంది. దీని వల్ల భవిష్యత్ లో యువ జనాభా తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

India sees decline in fertility: ప్రపంచంలో చాలా దేశాలకు ఇప్పుడు జనాభా సమస్య. ఆయా దేశాల్లో జననాల రేటు భారీగా తగ్గిపోయింది. చనిపోతున్న వారి కన్నా పుట్టే వారు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అనేక తంటాలు పడుతున్నారు. త్వరలో అలాంటి పరిస్థితి భారత్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది.
భారతదేశం 2025లో 146 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతోంది. కానీ దేశంలో సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది, ఇది పునరుత్పత్తి స్థాయి 2.1 కంటే తక్కువగా ఉంది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పిఎ) తాజా నివేదికలో వెల్లడయింది. 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (ఎస్‌ఓడబ్ల్యూపీ) నివేదిక జనాభా విషయంలో భారత్ ఎదుర్కోబోతున్న సవాళ్లను వివరించింది.
యూఎన్ నివేదిక ప్రస్తుతం భారతదేశ జనాభాను 146.39 కోట్లుగా అంచనా వేసింది. భారతదేశం ఇప్పుడు దాదాపు 150 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది.ఈ సంఖ్య 170 కోట్లకు చేరుకు నే ముందు తగ్గడం ప్రారంభమవుతుందని నివేదిక అంచనా వేసింది. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్‌ఆర్) ప్రస్తుతం మహిళకు ఇద్దరు పిల్లలుగా ఉంది. దీని అర్థం సగటున ఒక భారతీయ మహిళ తన సంతానోత్పత్తి సంవత్సరాలలో (సాధారణంగా 15-49 సంవత్సరాల వయస్సు) ఇద్దరు పిల్లలను కలిగి ఉంటారని అంచనా. 2021 సాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) నివేదిక ప్రకారం, ఈ రేటు 2020 నుండి స్థిరంగా ఉంది.
🚨India’s population is estimated to reach 1.46 billion in 2025, continuing to be the highest in the world, according to a new UN demographic report pic.twitter.com/rxxcny8nlB
— India & The World (@IndianInfoGuid) June 10, 2025
కొత్త నివేదిక ప్రకారం, ఇది 1.9 జననాలకు తగ్గింది, అంటే సగటున భారతీయ మహిళలు జనాభా పరిమాణాన్ని ఒక తరం నుండి మరొక తరానికి నిర్వహించడానికి అవసరమైన సంఖ్య కంటే తక్కువ జన్మిస్తున్నారు. పుట్టుకల రేటు తగ్గినప్పటికీ, భారతదేశ యువ జనాభా గణనీయంగా ఉంది, 0-14 సంవత్సరాల వయస్సు వారు 24 శాతం, 10-19 సంవత్సరాల వయస్సు వారు 17 శాతం, 10-24 సంవత్సరాల వయస్సు వారు 26 శాతం ఉన్నారు.
15-64 సంవత్సరాల వయస్సు వారు జనాభాలో 68 శాతం ఉండగా, వృద్ధ జనాభా (65 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ) 7 శాతంగా ఉంది. 2025 నాటికి, జనన సమయంలో ఆయుర్దాయం పురుషులకు 71 సంవత్సరాలు , మహిళలకు 74 సంవత్సరాలుగా అంచనా వేశారు. “భారతదేశం సంతానోత్పత్తి రేట్లను గణనీయంగా తగ్గించడంలో గొప్ప పురోగతి సాధించింది. 1970లలలో ప్రతి మహిళకు సగటున దాదాపు ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అది రెండు కంటే తక్కువ స్థాయికి చేరిందని యూఎన్ నివేదిక అంచనా వేసింది.





















