అన్వేషించండి

Single Use Plastic Ban: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో ఇంత ప్రమాదమా, అందుకే కేంద్రం బ్యాన్ చేసిందా?

సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్ వ్యర్థాలు అధికమవుతున్నందున బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు ప్లాస్టిక్‌ను నిషేధించాయి.

జులై1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ 

ప్లాస్టిక్‌ను వినియోగించకుండా మన రోజువారీ జీవితం గడవట్లేదు. అంతలా మన లైఫ్‌స్టైల్‌లో భాగమైపోయింది. ఈ వాడకం మితిమీరటం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. భూకాలుష్యం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌తో ముప్పు పెరుగుతోంది. అందుకే కేంద్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. జులై 1 వ తేదీ నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ తయారీ, వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ఎగుమతులు, దిగుమతులు, పంపిణీ, విక్రయాలపైనా ఈ నిషేధం వర్తించనుంది. జూన్ 28వ తేదీన ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించింది. 

ప్రపంచవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో గమనించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. నేలనే కాకుండా సముద్ర జలాలనూ కలుషితం చేస్తోంది ఈ ప్లాస్టిక్. 100 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధం అమలు కానుంది. 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి..? ఈ లిస్ట్‌లో ఏమేం వస్తాయంటే..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే...ఒక్కసారి మాత్రమే వాడుకుని తరవాత పారేసేవి. ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక మోతాదులో పెరగటానికి కారణం... ఈ ప్లాస్టికే. ఇక కేంద్రం నిషేధం విధించిన జాబితాలో ప్లాస్టిక్ స్టిక్స్‌ ఉన్నాయి. అంటే ఇయర్ బడ్స్, బెలూన్స్, క్యాండీ, ఐస్‌క్రీమ్‌ల తయారీకి వాడే  ప్లాస్టిక్‌ ఇకపై కనిపించదన్నమాట. వంట సామాన్ల కిందకు వచ్చే ప్లేట్స్‌, కప్స్, గ్లాసెస్, ఫోర్క్స్‌, స్పూన్స్, కత్తులు, ట్రేస్‌లాంటి వాటిపైనానిషేధం విధించనున్నారు. ప్యాకేజింగ్‌ సెక్షన్‌లోని స్వీట్‌ బాక్స్‌లు, ఇన్విటేషన్ కార్డ్‌లు, సిగరెట్ ప్యాకెట్ల తయారీపైనా బ్యాన్ అమలు  చేశారు. ఇవి కాకుండా, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లనూ బ్యాన్ చేశారు. 

 

వస్తువులు

జులై 1 నుంచి బ్యాన్ అయ్యేవి

ప్లాస్టిక్ స్టిక్స్ 

 

 

 

ఇయర్ బడ్స్ 

బెలూన్స్ 

క్యాండీ

ఐస్‌ క్రీమ్

వంటగదిలో వినియోగించే

వస్తువులు

 

 

 

 

 

ప్లేట్స్, కప్స్, గ్లాసెస్, ఫోర్క్స్, స్పూన్స్, కత్తులు, ట్రేలు

గ్లాస్ 

ఫోర్క్స్ 

స్పూన్స్ 

కత్తులు

ట్రే లు 

ప్యాకేజింగ్

 

 

స్వీట్ బాక్స్ 

ఇన్విటేషన్ కార్డ్స్

సిగరెట్ ప్యాకెట్లు

ఇతర వస్తువులు 

 

100 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉండే పీవీసీ బ్యానర్లు

పాలిస్థిరీన్‌తో తయారైన అలంకరణ వస్తువులు

Single Use Plastic Ban: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో ఇంత ప్రమాదమా, అందుకే కేంద్రం బ్యాన్ చేసిందా?

నిషేధం ఎందుకంటే..? 

2019లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భారత్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మార్చిలో మరోసారి ఇదే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ జరిగింది. ఈ అసెంబ్లీలో సింగిల్ ప్లాస్టిక్ యూజ్‌పై నిషేధానికి సంబంధించిన కార్యాచరణపై చర్చలు జరిపారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని
తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించారు. ఆ తరవాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేలా పౌరులకు అవగాహన కల్పించేలా ఈ యాప్‌ని తయారు చేశారు. అంతే కాకుండా ఏప్రిల్ 5వ తేదీన ప్రకృతి అనే స్పెషల్ ప్రోగ్రామ్‌నీ ప్రారంభించింది. 

ఈ బ్యాన్‌ను ఎలా అమలు చేస్తారు..? 

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ  శాఖ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ బ్యాన్‌ను కచ్చితంగా అమలు చేసేలా ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను నియమించనుంది. అక్రమంగా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటుంది. భారత్‌లో ఏటా 41 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి 
అవుతున్నట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఈ వ్యర్థాల్లో 10-35% వాటా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌దే. ఐదేళ్లలో తలసరి ప్లాస్టిక్ వినియోగం అధికవటమే ఇందుకు కారణం. 

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 9% మాత్రమే రీసైకిల్ అవుతోంది. దాదాపు 79% మేర ప్లాస్టిక్‌ నీళ్లలో, నేలలో కలిసిపోతోంది. అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌ను అతిక్రమించిన వారికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఇప్పటికే పలు దేశాలు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. 2002లో బంగ్లాదేశ్‌ థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని బ్యాన్ చేసింది. తరవాత 2019లో న్యూజిలాండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నింటిపైనా నిషేధం విధించింది. ముంబయి, కేరళ, అండమాన్ నికోబార్ సముద్ర జలాలు ప్లాస్టిక్‌ వల్ల తీవ్రస్థాయిలో కలుషిత మైనట్టు అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచంలో 267 జీవజాతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్లాస్టిక్‌ను 7-9 సార్లు రీసైకిల్ చేసేందుకు అవకాశముంటుంది. ఓ టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటం ద్వారా 3.8 బ్యారెళ్ల చమురుని ఆదా చేసుకోవచ్చు. 2015-16 మధ్య కాలంలో నేషనల్ రూరల్ రోడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ...ప్లాస్టిక్ వ్యర్థాలతో 7,500 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించింది. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget