News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

G20 Summit: ఎయిర్‌పోర్ట్‌లో కళాకారుల స్వాగతం.. డ్యాన్స్‌ చేసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌

G20 Summit: ఎయిర్‌పోర్ట్‌లో కళాకారుల స్వాగతం.. డ్యాన్స్‌ చేసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌

FOLLOW US: 
Share:

జీ 20 సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛైర్మన్‌ క్రిస్టాలినా జార్జివాకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జానపద నృత్యకారులు సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం పలికారు. కళాకారుల బృందం క్రిస్టాలినా వచ్చిన సమయంలో సంబల్‌పురి పాటపై సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఆమెను స్వాగతించారు. వారి ప్రదర్శన పట్ల క్రిస్టాలినా ఎంతో సంతోషించారు. డ్యాన్స్‌ చూస్తూ నవ్వుతూ కనిపించారు. అంతేకాకుండా వారు చేసిన కొన్ని స్టెప్స్‌ అనుకరించేందుకు ప్రయత్నించారు. అలా కొద్ది క్షణాలు డ్యాన్స్‌ చేసి నృత్యకారులకు తన ప్రశంసలు తెలిపారు. అక్కడి నుంచి వెళ్తూ వారికి నమస్కారం చేశారు. 

క్రిస్టాలినా జార్జివా విమానాశ్రయంలో సంతోషంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. 'ఐఎంఎఫ్‌ చీఫ్‌ జార్జివా జీ 20 సమావేశాల కోసం భారత్‌కు వచ్చారు. విమానాశ్రయంలో సంబల్‌పురి పాటకు కాలు కదిపారు.సంబల్‌పురి బీట్స్‌కు కాలు కదపడం కాస్త కష్టమేనని, ఒడియా ప్రైడ్‌' అంటూ ట్వీట్‌ చేశారు. 

ట్వీట్‌ చేసిన కొన్ని గంటల్లోనే వీడియోకు వేల కొద్ది వ్యూస్‌, లైక్స్‌ వస్తున్నాయి. ఇది ఒడిశాకు చాలా గర్వకారణం అని, చాలా అద్భుతంగా ఉందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇది మన సంస్కృతికి, సంగీతానికి ఉన్న బలం అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. వీడియో చాలా బాగుందంటూ, భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. భారతీయ సంస్కృతి, సంగీతం, డాన్స్‌లను అద్భుతంగా ప్రదర్శించారంటూ మరొకరు పేర్కొన్నారు. వీడియో ఎంత అద్భుతంగా ఉంది, ఆమె గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ తనలోని చిన్నపిల్ల మనసత్వాన్ని అలాగే ఉంచారు. ఆమె గ్రేట్‌ అని, సూపర్‌ అని పలువురు ట్వీట్లు చేశారు.

భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాల నుంచి దేశాధినేతలు, అధికారులు, ప్రతినిధులు దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, యూకే ప్రధాని రిషి సునాక్‌ సహా ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, యూఏఈ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నేతలు వస్తున్నారు. దీంతో దిల్లీలో, విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. విదేశాల నుంచి వస్తున్న అతిథులకు దిల్లీలోని లగ్జరీ హోటళ్లలో ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేకమైన వంటకాలతో మంచి ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారతీయ వంటకాలను ప్రత్యేకంగా వడ్డించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో సదస్సు జరగనుంది.

Published at : 09 Sep 2023 08:35 AM (IST) Tags: Odisha G20 summit Delhi Airport IMF Cheif Sambalpuri Dance

ఇవి కూడా చూడండి

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం