News
News
X

Ideas of India Summit 2023: ప్రపంచంలోనే ఇండియా నంబర్ వన్‌గా ఉండాలి, లిక్కర్ స్కామ్ అంతా ఫేక్ - కేజ్రీవాల్

Ideas of India Summit 2023: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

Ideas of India Summit 2023:

ఆరోపణలన్నీ అవాస్తవం..

ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రసంగం చేశారు. దేశ రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన...భారత్‌ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనా చర్చించారు. లిక్కర్ స్కామ్‌లో తమపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాపైనా తప్పుడు కేసులు పెట్టారని మండి పడ్డారు. తన ఇంట్లో, బ్యాంక్ లాకర్‌లలో తనిఖీలు చేశారని...ఆధారాలేమీ లభించలేదని తెలిపారు. 

"మనీశ్ సిసోడియాను విచారించేందుకు CBI మరోసారి నోటీసులు పంపింది. మాకున్న సోర్సెస్ ప్రకారం ఆయనను అరెస్ట్ చేస్తారు. తన ఇంట్లో తనిఖీలు చేశారు. బ్యాంక్‌ లాకర్లనూ సెర్చ్ చేశారు. కానీ తప్పు చేసినట్టు ఏ ఆధారాలూ దొరకలేదు. దేశంలోని పేద విద్యార్థులందరికీ ఉన్నతమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సిసోడియా పని చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని డీఫేమ్ చేసేందుకే ఇలా చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు" 

-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

ఇప్పటికే లిక్కర్ స్కామ్‌ కేసులో CBI విచారణ కొనసాగిస్తోంది. ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. అయితే...సిసోడియా పేరుని మాత్రం నిందితుల్లో చేర్చలేదు. ఈ కేసుపై చర్చించిన కేజ్రీవాల్ తాను, సిసోడియా 23 ఏళ్లుగా మంచి మిత్రులమని చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేశారు. అదానీ హిండన్ బర్గ్ అంశాన్నీ ప్రస్తావించారు. కేవలం ఇద్దరు, ముగ్గురికే వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేస్తున్నారని మండి పడ్డారు. కానీ వాళ్లు తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారని అన్నారు. 

"లోన్ ఇచ్చే ముందు ఆ కంపెనీ తిరిగి చెల్లించలగలదా లేదా అన్నది బ్యాంకులు ఆలోచించడం లేదు. అటు రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోతే మాత్రం వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హిండన్‌ బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్‌ స్టాక్‌లు దారుణంగా పడిపోయాయి. అదానీ గ్రూప్ ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. కానీ అదానీ గ్రూప్ మాత్రం ఈ తప్పుని ఒప్పుకోవడం లేదు" 

-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

ఇటీవలే అరవింద్ కేజ్రీవాల్ ఉద్దవ్ థాక్రేను కలిశారు. ముంబయిలోని బంద్రాలో థాక్రే నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇదే మీటింగ్‌లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ఉన్నారు. శివసేన పార్టీ పేరుని, గుర్తుని ముఖ్యమంత్రి శిందే వర్గానికి కేటాయించడంపై వీళ్లు చర్చించారు. అయితే...ఈ సమావేశంలో రాజకీయాల గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ అంశాలపై చర్చించినట్టు సమాచారం. 

"ఉద్దవ్ థాక్రే తండ్రి  బాలా సాహెబ్ థాక్రే సింహం లాంటి వాళ్లు. ఆయన పార్టీకి చెందిన పేరుని, గుర్తుని లాగేసుకున్నారు. ఇలాంటి దొంగలు ఎప్పుడూ సింహాలు అవ్వలేరు" 

-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

Also Read: Ideas of India 2023: ప్రపంచ దేశాలకు భారత్ ఓ మార్గదర్శి, ఈ దేశ గొంతుకను ప్రపంచమంతా వింటోంది - లిజ్ ట్రస్

Published at : 25 Feb 2023 08:46 AM (IST) Tags: Ideas of India Live Arawind Kejriwal Ideas of India Summit 2023 Ideas of India 2023 Ideas Of India

సంబంధిత కథనాలు

IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్

IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్

SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్‌ పేపర్‌' విషయంలో కీలక నిర్ణయం!

SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్‌ పేపర్‌' విషయంలో కీలక నిర్ణయం!

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!

Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి

Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ