Ideas of India 2023: ప్రపంచ దేశాలకు భారత్ ఓ మార్గదర్శి, ఈ దేశ గొంతుకను ప్రపంచమంతా వింటోంది - లిజ్ ట్రస్
Ideas of India 2023: ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ideas of India 2023:
ముంబయితో ప్రత్యేక అనుబంధం..
ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా (Ideas of India Summit 2023) సదస్సులో ముఖ్య అతిథిగా యూకే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముంబయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిన ఆమె...భారత్ ప్రపంచ దేశాలకు ఆశాకిరణంగా కనిపిస్తోందని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొనడం ఎంతో ఉత్సాహాన్నిస్తోందని చెప్పారు.
"నేను 90ల్లో ముంబయికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నాకు ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది. నేను కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. G20 సదస్సుకి జరుగుతున్న ఏర్పాట్లను చాలా ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. భారత్ ఎంతో పురోగతి సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారింది. ఆర్థిక పరంగా చూసినా భారత్ మెరుగైన స్థానంలో ఉంది. భారత్ గొంతుకను ప్రపంచమంతా వింటోంది"
-లిజ్ ట్రస్, యూకే మాజీ ప్రధాని
#WATCH | @trussliz tells @virsanghvi if #India should become a permanent member of the #UN Security Council
— ABP LIVE (@abplive) February 24, 2023
Ideas of India Summit 2023 @panavi #ABPIdeasOfIndia #NayaIndia pic.twitter.com/EMVo1qKyJZ
అంతర్జాతీయ అంశాలనూ (Ideas of India by ABP Network) ప్రస్తావించారు లిజ్ ట్రస్. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుని ఉండాల్సిందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పశ్చిమ దేశాలు ఇంకాస్త ముందుగానే స్పందించి ఉంటే బాగుండేది. అడిగిన వెంటనే ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చి ఉండాల్సింది. గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఇచ్చి ఉండాల్సింది. భారత్‌లో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగ్గా ఉంది. ఎంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. పౌరులకు వాక్‌స్వాతంత్రమూ ఉంది. UNSCలో ఇండియా శాశ్వత సభ్యత్వం దక్కాలి. చాలా విషయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. "
- లిజ్ ట్రస్, యూకే మాజీ ప్రధాని