Ashok Khemka: 57 సార్లు బదిలీ - ఈ సారి రిటైర్మెంట్ - ఐఏఎస్ అశోక్ ఖేమ్కా గురించి మీకు తెలుసా ?
IAS Officer: ఐఏఎస్ ఆఫీసర్లలో ప్రత్యేకంగా అశోక్ ఖేమ్కా. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గరు. ఆయన తన కెరీర్ లో 57 సార్లు బదిలీ అయ్యారు. ఆ చాన్స్ లేకుండా ఇప్పుడు రిటైరయ్యారు.

IAS Officer Ashok Khemka Retires: అశోక్ ఖేమ్కా 1991 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. 2025 ఏప్రిల్ 30న తన 34 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ సమయంలో హర్యానా రవాణా శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. . ఖేమ్కా ఐఏఎస్ అధికారిగా తన నిజాయితీ, అవినీతిపై పోరాటం, అసాధారణమైన కెరీర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఖేమ్కా తన 34 సంవత్సరాల కెరీర్‌లో 57 సార్లు బదిలీ అయ్యారు. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక రికార్డు. సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి బదిలీ అయ్యా. ఇది భారతదేశంలోని బ్యూరోక్రాట్‌లలో ఎక్కువ సార్లు బదిలీ అయిన వారిలో రెండో స్థానంలో ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్నీ 71 సార్లు బదిలీ అయ్యారు.
అవినీతిని వ్యతిరేకించడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడం, పవర్‌ఫుల్ వ్యక్తుల లాండ్ డీల్‌లలో అక్రమాలను బయటపెట్టడం వల్ల జరిగాయి. 2012లో ఖేమ్కా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. గురుగ్రామ్‌లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీ DLF మధ్య 3.5 ఎకరాల లాండ్ డీల్ మ్యూటేషన్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయం హర్యానాలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వం ఖేమ్కాపై తన అధికార పరిధిని అధిగమించారని, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారని చర్యలు తీసుకుంది. తర్వాత ఆయనను హర్యానా సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు.
ఖేమ్కా తన కెరీర్ అంతటా అవినీతిపై నిర్భీతంగా పోరాడారు. ఆయన గురుగ్రామ్ పరిసరాల్లో ₹20,000 కోట్ల నుండి ₹350,000 కోట్ల విలువైన కమర్షియల్ లాండ్ డీల్‌లలో అక్రమాలను బయటపెట్టారు. హర్యానా సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఫంగిసైడ్ సేకరణలో అక్రమాలను, లాండ్ కన్సాలిడేషన్ శాఖలో పంచాయతీ లాండ్ బదిలీలలో అవినీతిని బహిర్గతం చేశారు. 2023లో, ఖేమ్కా అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసి, విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను నడిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. 1988లో ఐఐటీ ఖరగపూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. సర్వీసులో ఉండగా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ కూడా సంపాదించారు
ఖేమ్కా తన కెరీర్‌లో చివరి 12 సంవత్సరాలలో ఎక్కువగా ఆర్కైవ్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వంటి “లో-ప్రొఫైల్” డిపార్ట్‌మెంట్‌లలో పనిచేశారు. ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్‌లో నాలుగు సార్లు పోస్టింగ్ పొందారు, వీటిలో మూడు బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. 2023లో ఆయన ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్‌లో తన వద్ద తగినంత పని లేదని, అయితే ఇతర అధికారులు అదనపు పోస్టింగ్‌లతో ఓవర్‌లోడ్ అయ్యారని సీఎంకు లేఖ రాశారు. ఖేమ్కా తన కెరీర్‌లో అనేకసార్లు సోషల్ మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. 2022లో, తన బ్యాచ్‌మేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీలుగా పదోన్నతి పొందినప్పుడు, ఆయన ట్వీట్ చేస్తూ, “ఇది సంతోషకరమైన సందర్భం అయినప్పటికీ, నేను వెనుకబడిపోయాననే దిగులు కూడా కలుగుతుందని స్పందించారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు.





















