Viral News: పెళ్లికి ముందే ఆస్పత్రి పాలైన వధువు అక్కడే తాళి కట్టేసిన వరుడు !
Hospital Turns Wedding Venue: ఇంకా తాళి కట్టలేదు కానీ ఆ భార్య పడిపోయింది. తీవ్ర అనారోగ్యం చేసింది. దీంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆ పెళ్లి కొడుకు అక్కడే తాళి కట్టేశాడు.

Hospital Turns Wedding Venue After Bride Gets Unwell: పెళ్లి మిస్ అయితే మళ్లీ పిల్ల దొరుకుతుందో లేదో.. దొరికినా మంచి ముహుర్తం ఉంటుందో లేదో అని కంగారుపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో పెళ్లి అయిందనిపించుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని బ్యావ్రా అనే ఊళ్లో పెళ్లి వేడుక ఒక్క సారిగా బోసి పోయింది. పెళ్లికిఐదురోజుల ముందు ఆ పెళ్లి కూతురు అనారోగ్యానికిగురైంది.వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.ముహుర్తం మించిపోతుందని అక్కడేపెళ్లి పూర్తి చేశాడు పెళ్లికడుకు.
💑 प्यार हो तो ऐसा!
— Arth Parkash (@arthparkash1) May 1, 2025
UP के राजगढ़ में दूल्हा बारात लेकर पहुंचा अस्पताल, वहीं रचाई शादी 👰♀️🤵
बीमार दुल्हन की हालत देख नहीं रुका, निभाया हर वादा ❤️
शादी से 5 दिन पहले भर्ती हुई थीं दुल्हन#UttarPradesh #Rajgarh #HospitalWedding #TrueLove #GroomInHospital #ViralNews #RealLoveStory pic.twitter.com/947RVg26NB
మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలోని కుంభరాజ్‌కు చెందిన నందిని అనే యువతి బ్యావ్రాకు చెందిన ఆదిత్య సింగ్‌తో వివాహం నిశ్చయం అయింది. వివాహం అక్షయ తృతీయ సందర్భంగా జరగాల్సి ఉంది. వివాహానికి ఐదు రోజుల ముందు, నందిని అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై, బ్యావ్రాలోని పంజాబీ నర్సింగ్ హోమ్‌లో చేరింది. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
షెడ్యూల్ ప్రకారం దుల్హన్ ఇంటికి బారాత్ వెళ్లాల్సి ఉండగా, నందిని ఆస్పత్రిలో ఉండటం వల్ల, ఆదిత్య సింగ్ బ్యాండ్-బాజా, బారాతీలతో సహా నేరుగా పంజాబీ నర్సింగ్ హోమ్‌కు చేరుకున్నాడు. వివాహాన్ని వాయిదా వేయడం కంటే ఆస్పత్రిలోనే జరపడం శుభమని భావించారు. ఆస్పత్రిలోనే మండపం రెడీ చేశారు. వైదిక మంత్రోచ్చారణాలతో హిందూ సంప్రదాయం ప్రకారం ప్రకారం పెళ్లిచేశారు. నందిని బలహీన స్థితిలో నడవలేని స్థితిలో ఉంది. దాంతో వరుడు ఎత్తుకుని ఎడు అడుగులు నడిచాడు.
राजगढ़ जिले के ब्यावरा... जहां अक्षय तृतीया पर एक अनोखी शादी हुई... आमतौर पर हम शादियों के लिए मैरिज गार्डन या घर के अंदर की सजावट और धूमधाम देखते हैं, लेकिन इस बार दूल्हा अपनी बारात लेकर कहीं और नहीं, बल्कि सीधे अस्पताल#HospitalWedding #ByawraKiShaadi pic.twitter.com/dsC56k5etV
— NEWS HOUR 24x7 (@NewsHour434) May 1, 2025
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలు రకాల అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేశారు. ఆ వధువు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా అలా ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకోవడం ప్రేమ కాదనికొంత మంది అంటున్నారు. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చని కానీ అనారోగ్యంతో ఉన్న ఆమెను అలా ఇబ్బంది పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు వేశారు అయితే కొంత మంది మాత్రం అనారోగ్యం పాలైనా మాట ప్రకారం పెళ్లి చేసుకున్నాడని అభినందిస్తున్నారు.





















