IAF fighter : యుద్ధ విమానం నుంచి జారి పడిన ఆయుధాలు - ఉలిక్కిపడిన పోఖ్రాన్ - చివరికి ..
Pokhran : యుద్ధ విమానం గాల్లో నుంచి వెళ్తూ శత్రువులపై బాంబులు విసురుతుంది. కానీ అందులో నుంచి పొరపాటున ఏవైనా కింద పడితే ? అవి ప్రమాదకరమైన బంబాలు అయితే ? పోఖ్రాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
IAF fighter aircraft drops ‘air store’ : రాజస్థాన్ లోని పోఖ్రాన్ అంటే ప్రపంచం మొత్తం తెలుసు. ముఖ్యంగా భారతీయులంరికీ తెలుసు. ఎందుకంటే.. భారత్ అణుశక్తి సామర్థ్యాన్ని పరీక్షించుకుంది అక్కడే. పోఖ్రాన్ లో అణుపరీక్షలు జరిగాయి. అందుకే పోఖ్రాన్ అంటే అందరికీ తెలిసిన ప్రదేశం.
చాలా పెద్ద విస్తీర్ణంతో ఉండే ఎడారి ప్రాంతమైన పోక్రాన్ లో అక్కడక్కడా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు దూరంగా బుధవారం పెద్ద శబ్దం వచ్చింది. ఏదో బాంబు పేలిన శబ్దం రావడంతో ఆ గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లి చూశారు. ఓ వస్తువు ముక్కలైనట్లుగా గుర్తించారు కానీ ఎవరూ పట్టుకోలేదు. అధికారులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఆర్మీ అధికారులు వచ్చి మొత్తం ముక్కలు అయిపోయిన వస్తువును సేకరించి తమతో తీసుకెళ్లిపోయారు. అసలేం జరిగిందో మాత్రం.. తర్వాత ప్రకటించారు. అదేమిటంటే.. యుద్ధ విమానం నుంచి ఓ వస్తు్వు జారిపడిపోయిందట.
జైసల్మీర్ ప్రాంతంలో భారత ఆర్మీ బేస్ ఉంది. అక్కడ తరచూ యుద్ధ విమానాలు ఎగురుతూ ఉంటాయి. ఆయుధాలను ట్రాన్స్ పోర్టు చేయడంతో పాటు పైలట్లు ప్రాక్టీస్ కూడా చేస్తూంటారు. ఈ క్రమలో ఓ యుద్ధ విమానం పోఖ్రాన్ మీదుగా వెళ్తున్న సమయంలో అందులోనుంచి ఓ వస్తువు జారి పడిపోయింది. జారిపడిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ భారీ శబ్దం వచ్చింది. బహుశా అది బాంబే అయి ఉంటుందని భావిస్తున్నారు.
🔺IAF MISHAP:
— Tactical Tribune (@TacticalTribun) August 21, 2024
An Indian Air Force fighter jet developed a technical failure due to which it had to drop its payload (an air store) in Pokhran firing range, Rajasthan. More info is awaited pic.twitter.com/AcypPZVNs3
అయితే రక్షణ నిపుణులు మాత్రం ఫైటర్ జెట్ నుంచి పొరపాటున క్షిపణి రిలీజ్ అయి ఉంటుందని చెబుతున్నారు. వార్ హెడ్ లు ఎప్పుడూ ఫైటర్ జెట్‌లకు అమర్చి ఉంటారు. అలా అమర్చిన ఫైటర్ జెట్‌లో మానవ తప్పిదం లేదా.. సాంకేతిక తప్పిదం ద్వారా.. వార్ హెడ్ రిలీజ్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఐఏఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నందున ఏ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పొరపాటున ఓ వస్తువు కింద పడిందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అదేమిటన్నది మాత్రం చెప్పలేదు.
యుద్ధ విమానం నుంచి ఓ వస్తువు పడిపోయిందని ఆర్మీ ప్రకటించింది కానీ.. ఏమి పడిందని చెప్పలేదు. కానీ ఈ ఘటనపై అంతర్గత విచారణ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదేశించింది. సాంకేతిక లోపం కారణంగా.. ఆ వస్తువు యుద్ధ విమానం నుంచి జారిపోయింని చెబుతున్నారు
మొత్తంగా ఇలా కూడా యుద్ధ విమానాల నుంచి వస్తువులు జారీ పడిపోతే.... ఎవరూ లేని చోట పడింది కాబట్టి సరిపోయింది కానీ.. అదే జనావాసాల మధ్య పడి ఉంటే పెద్ద సమస్య తలెత్తేదని భావిస్తున్నారు.