అన్వేషించండి

Hyundai Creta Latest Updates: క్రెటాలో మూడు వెర్ష‌న్ల‌ను రిలీజ్ చేసిన హ్యుందయ్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో కార్ ల‌వ‌ర్స్ ఖుషీ.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు!!

క్రెటా కొత్త వెర్ష‌న్ల‌ను హ్యుంద‌య్ తాజాగా విడుద‌ల చేసింది. మూడు విభిన్న‌మైన మోడ‌ళ్లు, వాటికి సంబంధించిన ఫీచ‌ర్లు కారు ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే ధ‌ర వివ‌రాలను కూడా కంపెనీ వెల్ల‌డించింది.

Hyundai Creta Trims Latest News:  పండుగ సీజ‌న్ స‌మీపిస్తుండ‌టంతో చాలా కంపెనీలు త‌మ కొత్త ఉత్ప‌త్తుల‌ను మార్కెట్లోకి వ‌దులుతున్నాయి. తాజాగా ఇదే కోవ‌లో హ్యుంద‌య్ కార్ల కంపెనీ కూడా త‌మ మూడు మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేసింది.  హ్యుందాయ్ తన ప్రఖ్యాత కాంపాక్ట్ SUV క్రెటా భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కొత్త ట్రిమ్స్‌ను పరిచయం చేసింది. కింగ్, కింగ్ నైట్, కింగ్ లిమిటెడ్ ఎడిషన్ పేర్ల‌తో మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇందులో కింగ్ వేరియంట్ ఇప్పుడు రెగ్యులర్ క్రెటాలో టాప్-స్పెక్ వేరియంట్‌గా నిలిచిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కొత్త బ్లాక్ మ్యాట్ క‌ల‌ర్ తో అందుబాటులో ఉంది. దీనిలో కొత్తగా వచ్చిన ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.  డ్రైవర్ సీట్‌కు మెమొరీ ఫంక్షన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే, డాష్‌క్యామ్, అలాగే సీటు వెనుక భాగంలో రీట్రాక్టబుల్ ట్రే వంటివి ఉన్నాయి. కింగ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా అదే ఫీచర్లతో వస్తోంది కానీ అదనంగా సీట్ బెల్ కవర్లు, హెడ్‌రెస్ట్ కుషన్స్, మ్యాట్స్ , కీ కవర్‌లపై ప్రత్యేకమైన ‘కింగ్’ బ్రాండింగ్ ఉంటుంది. ఇక కింగ్ నైట్ ట్రిమ్‌లో కూడా ఇదే ఫీచర్లు ఉంటాయి కానీ ఇది ప్రత్యేకంగా 18-ఇంచుల బ్లాక్ అలాయ్ వీల్స్ ,‘నైట్’ బ్యాడ్జింగ్ తో వస్తుండటంతో చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

ధ‌ర‌ల వివ‌రాలు..
ధరల విషయానికొస్తే, క్రెటా కింగ్ వేరియంట్ ధరలు ఈకింది విధంగా ఉన్నాయి. పెట్రోల్ MT ₹17.89 లక్షలు, CVT ₹19.35 లక్షలు; డీజిల్ MT ₹19.47 లక్షలు, AT ₹20.42 లక్షలు; టర్బో పెట్రోల్ DCT ₹20.61 లక్షలుగా కంపెనీ నిర్దారించింది.  క్రెటా కింగ్ నైట్ ధరలు కూడా కంపెనీ విడుద‌ల చేసింది. పెట్రోల్ CVT ₹19.49 లక్షలు, డీజిల్ AT ₹20.92 లక్షలు ఉండ‌గా,  కింగ్ లిమిటెడ్ ఎడిషన్ ధరలు.. పెట్రోల్ CVT ₹19.64 లక్షలు, డీజిల్ AT ₹20.92 లక్షలుగా కంపెనీ నిర్ణ‌యించింది. క్రెటా N లైన్ వేరియంట్లలో కూడా డ్యుయల్ జోన్ ఆటో AC, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ ప్లే, డాష్‌క్యామ్ వంటి కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. N లైన్ N8 DCT ధర ₹19.70 లక్షలు, N10 MT ₹18.46 లక్షలు, DCT ₹20.66 లక్షలుగా కంపెనీ నిర్ణ‌యించింది. 

మూడు ఇంజిన్ల ఆప్ష‌న్..
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. 1.5L నాచురల్ పెట్రోల్ (115PS/144Nm), 1.5L డీజిల్ (116PS/250Nm), 1.5L టర్బో పెట్రోల్ (160PS/253Nm) ఫీచ‌ర్ల‌తో ల‌భిస్తుంది. అలాగే  వేర్వేరు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. క్రెటా , క్రెటా N లైన్ మోడల్స్ ప్రధానంగా Kia Seltos, Maruti Grand Vitara, Toyota Hyryder, Honda Elevate, Skoda Kushaq , Volkswagen Taigun వంటి SUV మోడల్స్‌కు పోటీగా నిలుస్తున్నాయని కంపెనీ విశ్వాసంగా ఉంది. పై ధరలన్నీ  పాన్-ఇండియా ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లుగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BRICS Summit 2026 India: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?
బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?
Harish Rawat Resign: పీఏ ఇంట్లో భారీగా గోల్డ్, డబ్బు స్వాధీనం.. కాంగ్రెస్ పదవులకు మాజీ సీఎం రాజీనామా
పీఏ ఇంట్లో భారీగా గోల్డ్, డబ్బు స్వాధీనం.. కాంగ్రెస్ పదవులకు మాజీ సీఎం రాజీనామా
ABP Desam Top 10, 12 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 12 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Andhra Pradesh Rains Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Embed widget