అన్వేషించండి

Renault, Nissan నుంచి పలు కొత్త మోడ‌ళ్లు.. వివిధ కేట‌గిరీల్లో త్వ‌రలో కార్ల లాంఛ్.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు

నిస్సాన్, రెనో కొత్త మోడ‌ళ్ల‌తో కార్ మార్కెట్ లో హ‌ల్చ‌ల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్ప‌టికే వివిధ కేట‌గిరీల‌కు సంబంధించి, కొత్త మోడ‌ళ్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

Renault and Nissan New Cars In  India Latest News: ఎస్ యూవీ కేట‌గిరీలో కొత్త మోడ‌ళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని రెనో, నిస్సాన్ క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఇప్ప‌టి మార్కెట్ అభిరుచుల‌కు అనుగుణంగా ఈ మోడ‌ళ్ల‌ను రూపొందించాయి. రెనో , నిస్సాన్ భారత ఆటో రంగంలోకి కొత్త SUV మోడల్స్‌తో అడుగుపెడుతున్నాయి. వీటిలో మిడ్‌సైజ్ SUVలతో పాటు 7-సీటర్ల SUVలు కూడా ఉంటాయి. రెనో తన ప్రసిద్ధ డస్టర్ రీ మోడ‌ల్ ను భారత మార్కెట్‌లో మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది, కాగా నిస్సాన్ పూర్తిగా కొత్త మిడ్‌సైజ్ SUV "కైట్" (Kait) ను తీసుకొస్తోంది. వీటి అదనంగా, రెండు బ్రాండ్‌లు తమ తమ కొత్త 7-సీటర్ల SUVలను కూడా త్వరలో లాంచ్ చేయనున్నాయి. రాబోయే రోజుల్లో భారత వినియోగదారులకు SUV విభాగంలో మరింత ఆధునికత, టెక్నాలజీ,  విలాసవంతమైన ఫీచర్లతో కొత్త ఎంపికలు లభించనున్నాయి. 2025లో రెనో డస్టర్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి వస్తోంది. ఇందులో 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 156bhp పవర్ , 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ,ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో ఈ SUV లభ్యమవుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యుయ‌ల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, 10-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఈసారి డస్టర్ మరింత ఆధునికంగా, టెక్నాలజీ పరంగా సూప‌ర్బ్ గా త‌యార‌వుతోంది. 

2026లో..
నిస్సాన్ కైట్ 2026లో మ‌న దేశంలో విడుదల కానుంది. ఇది రీనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు, అయితే రూపకల్పన , ఫీచర్ల పరంగా ఇది మరింత ప్రీమియంగా ఉంటుంది. ఇందులో నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, క్రోమ్ డిటైలింగ్, L-ఆకారంలోని LED DRLs ఉంటాయి. SUVలో మల్టీ డ్రైవ్ మోడ్స్, రియర్ AC వెంట్స్, 360-డిగ్రీ కెమెరా , 10.1-ఇంచ్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌ను ఉపయోగిస్తారు. అయితే తర్వాత దీనిలో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా చేర్చనున్నారు.

కొత్త 7 సీట‌ర్..
రెనో తన 7-సీటర్ SUV "బోరియల్" (Boreal) ను వ‌చ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.14 లక్షల నుండి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మరోవైపు నిస్సాన్ కూడా 2027 ప్రారంభంలో తన 7-సీటర్ SUVను లాంచ్ చేయనుంది. ఇది కైట్ లాగా ఉంటుంది కానీ మరింత స్పేస్ , ఫీచర్లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు SUVలలోనూ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీ , AWD (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కొత్త మోడ‌ళ్ల‌తో ఈ రెండు కంపెనీలు హ‌ల్చ‌ల్ చేయాల‌ని చూస్తున్నాయి. ఈ ఏడాది, వచ్చే సంవత్సరాల్లో వరుసగా కార్ లాంచ్ లు ఈ కంపెనీల నుంచి ఉండవచ్చని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Triumph 350cc రేంజ్‌పై మరో ధరల భారం - ఏ మోడల్‌కు ఎంత పెరిగిందో తెలుసా?
Triumph బైక్‌ల రేట్లు మళ్లీ పెంపు - రెండు నెలల్లో రెండోసారి షాక్!
Best Budget Cars for Daily Commute: ఈ ఐదు కార్లు రోజువారీ ఆఫీస్ వెళ్లేందుకు ఉత్తమమైనవి! పూర్తి వివరాలు ఇవే!
ఈ ఐదు కార్లు రోజువారీ ఆఫీస్ వెళ్లేందుకు ఉత్తమమైనవి! పూర్తి వివరాలు ఇవే!
E20 Fuel: E20 ఇంధనం మీ కారు ఇంజిన్‌కు హాని కలిగిస్తుందా? టయోటా, మారుతి సుజుకి ఏం చెప్పాయి? 
E20 ఇంధనం మీ కారు ఇంజిన్‌కు హాని కలిగిస్తుందా? టయోటా, మారుతి సుజుకి ఏం చెప్పాయి? 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget