అన్వేషించండి

GST తగ్గింపుతో Maruti Fronx మరింత చౌక - ఒక కొత్త బైక్‌ కొనేంత డబ్బు మీకు మిగులుతుంది!

Maruti Fronx GST reduction: మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు సగటున లీటరుకు 22.89 కి.మీ. వరకు మైలేజీ ఇవ్వగలదు.

Maruti Suzuki Fronx New Price After GST Cut: ఈ దీపావళి నాటికి మీ ఫ్యామిలీకి గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఒక మంచి కారు కొనాలని మీరు ఆలోచిస్తుంటే, మీ ఆలోచన నిజమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే, ఈ దీపావళి నాటికి చిన్న కార్లు ధరలు తగ్గి, మరింత చౌకగా మారబోతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, చిన్న కార్లు సహా చాలా ఉత్పత్తులపై GST తగ్గించాలని యోచిస్తోంది, దీపావళి నాటికి దీనిని అమలు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం, చిన్న కార్లపై 28% GST & 1 శాతం సెస్ విధిస్తున్నారు. అంటే, మొత్తం 29 శాతం పన్ను విధించబడుతుంది.

GST తగ్గిన తర్వాత...
చిన్న కార్లు సహా చాలా ఉత్పత్తులను, ప్రస్తుతం ఉన్న 28% GST స్లాబ్‌ రేటును నుంచి 18% స్లాబ్‌ రేటులోకి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇది అమలైతే, కొత్త కారు కొనేవాళ్లు నేరుగా 10% తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు. 

మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత మారుతుంది? 
మీరు, ఈ దీపావళికి, Maruti Fronx ను కూడా చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 28% GST రేటును నుంచి 18% రేటులోకి మారే అవకాశం ఉన్న కార్ల లిస్ట్‌లో మారుతి ఫ్రాంక్స్‌ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, మారుతి ఫ్రాంక్స్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 7,58,500 రూపాయలు (Maruti Fronx price, Hyderabad Vijayawada). 28% GST రేటు ప్రకారం, ఇప్పుడు, ఈ కారుపై రూ. 2,19,964 పన్ను & సెస్ విధిస్తున్నారు. ఈ పన్నును 10 శాతం తగ్గిస్తే, కారు ధర ఏకంగా రూ. 75,849 తగ్గుతుంది. అంటే, కొత్త మారుతి ఫ్రాంక్స్ మీద మీకు దాదాపు రూ. 76,000 మిగులుతుంది, ఈ డబ్బుతో ఒక కొత్త బైక్‌ కూడా కొనవచ్చు. 

మారుతి ఫ్రాంక్స్ పవర్‌ట్రెయిన్ 
మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. మొదటిది 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్, ఇది కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గం వేగాన్ని అందుకోగలదు. రెండోది 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్ VVT ఇంజిన్, ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌లతో, ప్యాడిల్ షిఫ్టర్‌లతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతారు. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ డేటా ప్రకారం, మారుతి ఫ్రాంక్స్ లీటరుకు సగటున 22.89 కి.మీ. వరకు మైలేజీ ఇవ్వగలదు. 

ప్రీమియం ఫీచర్లు
మారుతి ఫ్రాంక్స్ క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ & వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రియర్‌ AC వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. కలర్ MIDతో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వేగవంతమైన USB ఛార్జింగ్ పోర్ట్, కనెక్టెడ్‌ కార్ ఫీచర్లు & లెదర్‌ స్టీరింగ్ వీల్ వంటి మోడ్రన్‌ ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. ఈ కారుకు 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ బిగించారు, ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తంగా, ఇది యూత్‌ఫుల్‌ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కారు.

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Embed widget