Hindu Temples In Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని హిందూ ఆలయాలున్నాయి? అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంది?
Hindu Temples In Pakistan: పాకిస్థాన్‌లో హిందువుల పరిస్థితి మొదటి నుంచి దారుణంగా ఉంది. ఇది మాత్రమే కాదు, అక్కడి రాడికల్స్ నిరంతరం హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Hindu Temples In Pakistan : ఇటీవలి కాలంలో పరదేశంలో హిందూ దేవాలయాల పరిస్థితి దారుణంగా తయారైంది. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో మైనారిటీ హిందూ వర్గాలను టార్గెట్ చేయడం సైతం సాధారణ విషయంగా మారింది. అయితే దేశం విడిపోయి పాకిస్థాన్ ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా అవతరించినప్పుడు ఎన్ని హిందూ దేవాలయాలు ఉండేవో తెలుసా? పాకిస్థాన్‌లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉండేవో, వాటిలో ఇప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్‌లో దేవాలయాలపై దాడులు
భారతదేశం పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో, మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిని చంపడం, వారి మత స్థలాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారింది. పాకిస్థాన్‌లోని ఛాందసవాదులు తరచూ హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వాటిని కూల్చివేసేందుకు ప్రయత్నిన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అందులో మత ఛాందసవాదులు హిందూ దేవాలయాలు, దేవతల ఫొటోలను ధ్వంసం చేయడం చూడవచ్చు.
పాకిస్థాన్‌లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే..
చాలా మందికి తెలియని ఏమిటంటే పాకిస్థాన్‌లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? అందిన సమాచారం ప్రకారం, స్వాతంత్ర్యం సమయంలో పాకిస్థాన్ ప్రాంతంలో చాలా దేవాలయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య చాలా పడిపోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో చాలా దేవాలయాలను కూల్చివేశారు. ఛాందసవాదులు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు.
పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన చాలా సంవత్సరాల తరువాత కూడా, దేవాలయాల కూల్చివేత, హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నేటికీ అక్కడ చాలా హిందూ కుటుంబాలు బలవంతంగా జీవిస్తున్నాయంటే అందులో ఏమాత్రం అబద్దం లేదు. పాకిస్థాన్ హిందూ హక్కుల ఉద్యమం ప్రకారం, 1947లో దేశ విభజన జరిగినప్పుడు, పాకిస్తాన్ ప్రాంతంలో 428 దేవాలయాలు ఉండేవి. కానీ 1990ల నాటికి 408 దేవాలయాలు రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మరికొన్ని మదర్సాలుగా మారిపోయాయి.
స్థానిక ప్రజలు చెబుతున్న ప్రకారం, దారా ఇస్మాయిల్ ఖాన్ పాకిస్థాన్‌లోని కలిబారి ఆలయం స్థానంలో తాజ్ మహల్ హోటల్‌ను నిర్మించారు. పఖ్తున్‌ఖ్వాలోని బన్నూ జిల్లాలో ఒక హిందూ దేవాలయం ధ్వంసం చేశారు. దాని స్థానంలో ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఓపెన్ చేశారు. ఇక ఇప్పుడు కోహట్‌లోని శివాలయంలో ఒక పాఠశాల నడుస్తోంది. ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో 22 హిందూ దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో అత్యధికంగా 11 దేవాలయాలు ఉన్నాయి. ఇది కాకుండా, పంజాబ్‌లో నాలుగు, పఖ్తున్‌ఖ్వాలో నాలుగు, బలూచిస్తాన్‌లో మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో, సమీపంలో నివసించే హిందూ సమాజానికి చెందిన ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేరే గత్యంతరం లేక వారు బలవంతంగా మతం మారవలసి రావడం అత్యంత బాధాకరం.
పీవోకే సమర్థమైన అధికారిగా రాజేందర్ మేఘవార్
పాకిస్తాన్‌లో ఎప్పుడూ అల్ల కల్లోల పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఇంకా ఎక్కువ. అక్కడి ప్రజలు ప్రభుత్వ వివక్షపై ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి రాజేంద్ర మేఘవార్ లాంటి అధికారులు అవసరమని ఆయనను నియమించారు. పాకిస్తాన్ లో హిందువులపై దాడులు గురించి తరచూ వార్తలు వస్తూంటాయి. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో కూడా కొంత కాలం కిందట ఓ హిందూ క్రికెటర్ ఉన్నారు. ఆయన పేరు దానేష్ కనేరియా. తన పై టీమ్‌లో ఎంతో వివక్ష చూపించేవారని ఆయన పలుమార్లు బాధపడ్డ విషయం తెలిసిందే.